నవతెలంగాణ – గోవిందరావుపేట
మండలంలో ఈనెల 27 తారీకు నాడు ప్రారంభమైన వినాయక చవితి పండుగను చివరి రోజున నిమజ్జనం చేసే సమయంలో ఎలాంటి డీజే కానీ సౌండ్ బాక్స్ లు గాని పెట్టరాదని పస్రా సిఐ దయాకర్ తెలిపారు. శనివారం దసరా పోలీస్ స్టేషన్లో ఉత్సవ కమిటీలకు సిఐ పలు సలహాలు సూచనలు చేశారు. గణేశుని నిమజ్జనానికి తీసుకెళ్లే సమయంలో భక్తిశ్రద్ధలతో తీసుకెళ్లాలి డీజే లు, సౌండ్ బాక్సులు పాటలు పెట్టి ప్రజలకు ఇబ్బంది కలిగించరాదని తెలిపారు. గోవిందరావుపేట, తడ్వాయి మండలంలోని డీజే ఓనర్లను పిలిచి వారికి తగు సూచనలు తెలియజేశారు. ఎవరైనా నిమజ్జనం రోజు డీజే లు పెట్టి ప్రజలను ఇబ్బంది పెడితే వారిపై చట్టరీత్యా తగు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పస్రా ఎస్సై ఏ. కమలాకర్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
గణేష్ నిమజ్జనానికి డీజే లకు పర్మిషన్ లేదు: సీఐ దయాకర్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES