నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండల కేంద్రంలోని ఆర్ఎంపి, పి.ఎం.పి ప్రయివేటు క్లినిక్ లను జిల్లా డిఎంహెచ్ఓ డిప్యూటీ డిఎంహెచ్ఓ లు గురువారం ఆకస్మిక తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వ నిబంధనల ప్రకారమే క్లినిక్ లను నడపాలని సూచించారు. లేనియెడల కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. క్లీనిక్ లలో ఏ విధమైన ఫస్ట్ చేయాలో వాటిని చేయాలని, అది కాకుండా నిబంధనలను ఉల్లంఘించి ఇష్ట రీతిన చేస్తే చర్యలు తప్పవని అన్నారు. మద్నూర్ మండల కేంద్రంలో ఆర్.ఎం.పి పిఎంపి క్లినిక్ లతోపాటు డోంగ్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి తనిఖీ చేశారు. ఇలాంటి తనిఖీలు అప్పుడప్పుడు చేపడితే ఆర్ఎంపి, పిఎంపి క్లినిక్ ల ఆగడాలు ఏమిటో తెలుస్తాయని, ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రయివేట్ క్లీనిక్ లను ఆకస్మిక తనిఖీ చేసిన డీఎంహెచ్ఓ
- Advertisement -
- Advertisement -



