Friday, August 22, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన డిఎంఓ

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన డిఎంఓ

- Advertisement -

నవతెలంగాణ – కమ్మర్ పల్లి : మండల కేంద్రంలోని ప్రభుత్వ పాదామిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా మలేరియా కంట్రోల్ కంట్రోల్ అధికారి డాక్టర్ తుకారాం రాథోడ్ గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య కేంద్రం సిబ్బందితో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఇప్పటివరకు ఆరోగ్య కేంద్రంలో నమోదైన సీజనల్ వ్యాధులు డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా తదితర కేసుల గురించి పదవికి ఆరోగ్య కేంద్రం వైద్యులు, మండల వైద్యాధికారి డాక్టర్ నరసింహ స్వామిని అడిగి తెలుసుకున్నారు. వాటికి సంబంధించిన రికార్డులను పరిశీలించారు. గ్రామాల్లో పరిసరాల పరిశుభ్రతతోనే వ్యాధులు దూరమైతాయని విషయాన్ని ప్రజలకు అవగాహన కల్పించాలని సిబ్బందికి సూచించారు. వర్షాకాలం ప్రారంభంలో సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలతోపాటు ఆరోగ్య సిబ్బంది కూడా అప్రమత్తంగా ఉండాలన్నారు. గ్రామాల్లో మురుగునూరు నిలువ ఉండకుండా గ్రామ పంచాయతీ సిబ్బంది సహకారంతో తగిన చర్యలు చేపట్టాలన్నారు. దోమల నియంత్రణకు పాగింగ్ చేయించాలని, మురుగు కలల వద్ద బీచింగ్ పౌడర్ చల్లించాలన్నారు. పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవడంతోనే వ్యాధులు అరికట్టవచ్చని, ఈ విషయాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుపోవాలన్నారు. ఈ సందర్భంగా సిబ్బందికి పలు సలహాలు సూచనలు చేశారు. కార్యక్రమంలో సిహెచ్ఓ రమణ, ఆరోగ్య పర్యవేక్షకులు  ఆకుల మారుతి, ల్యాబ్ అసిస్టెంట్ హారిక, ఏఎన్ఎంలు కృష్ణవేణి, స్వరూప, ఆశ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad