- Advertisement -
నవతెలంగాణ – ఊరుకొండ
అర్ధాంతరంగా మృతి చెందిన బడుగు బలహీన వర్గాల నిరుపేదలకు తన వంతు సహాయ సహకారాలు అందించి ఆదుకుంటున్న ప్రజా నాయకుడు ధ్యాప నిఖిల్ రెడ్డి అని స్థానిక నాయకులు అన్నారు. బుధవారం ఊరుకుంటా మండల పరిధిలోని మాదారం గ్రామానికి చెందిన అంకూరీ చెన్నయ్య అనారోగ్యంతో మృతి చెందారు. స్థానిక నాయకుల ద్వారా విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ సర్పంచ్ ధ్యాప నిఖిల్ రెడ్డి బాధిత కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ తక్షణ సహాయం కింద 5వేలు అందజేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, డిఎన్ఆర్ యువసేన సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -