Thursday, October 23, 2025
E-PAPER
Homeఆదిలాబాద్పీహెచ్‌డి‌ పట్టాను సాధించిన జ్ఞానేశ్వర చారి

పీహెచ్‌డి‌ పట్టాను సాధించిన జ్ఞానేశ్వర చారి

- Advertisement -

నవతెలంగాణ-ఆదిలాబాద్ టౌన్
పట్టణానికి చెందిన ఉదారి జ్ఞానేశ్వర చారి విజయవాడలోని కె.ఎల్‌ విశ్వవిద్యాలయం నుండి పీహెచ్‌.డి‌ పట్టాను సాధించారు. “డిజైన్ అండ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్‌  సీఎంఓఎస్ అనలాగ్ ఫ్రాంటెండ్ డిజైన్ ఫర్ 12 లీడ్ ఈసీజీ  హృదయ స్పందనలను ఖచ్చితంగా గుర్తించే తక్కువ విద్యుత్‌ వినియోగం గల వైద్య పరికరాల రూపకల్పనపై పరిశోధనకు చేశారు. ఈ పరిశోధనను కె.ఎల్‌. విశ్వవిద్యాలయం ప్రొఫెసర్‌ డాక్టర్‌ కాకర్ల హరి కిశోర్ మార్గదర్శకత్వంలో విజయవంతంగా పూర్తి చేశారు.

ఆయన పర్యవేక్షణలో జ్ఞానేశ్వర చారి ఆధునిక సీఎంఓస్ సాంకేతికత ఆధారంగా ఈసిజి డేటా సేకరణ, సిగ్నల్‌ విశ్లేషణ, శక్తి సామర్థ్యాన్ని మెరుగుపరిచే విధానాలను అభివృద్ధి చేశారు. ప్రస్తుతం ఉదారి జ్ఞానేశ్వర చారి నర్సాపూర్‌లోని బి.వి. రాజు ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తూ, విఎల్ఎస్ఐ విభాగానికి కోఆర్డినేటర్‌గా సేవలు అందిస్తున్నారు. ఆయన విద్యార్థులకు ఆధునిక సెమీకండక్టర్‌, అనలాగ్‌ ఐసీ డిజైన్‌, మరియు ప్యాకేజింగ్‌ టెక్నాలజీలలో మార్గనిర్దేశం చేస్తున్నారు. పరిశోధన ప్రయాణం సాఫల్యం సాధించడానికి నిరంతర ప్రోత్సాహం అందించిన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు జ్ఞానేశ్వర్ పేర్కొన్నారు. వారి ఆశీస్సులు, నమ్మకం మార్గదర్శకంగా నిలిచాయని అన్నారు. అలాగే పట్టా సాధించడం పట్ల పలువురు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ అభినందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -