– మరోసారి ప్రజలే పట్టం కడతారు : ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి
– కామారెడ్డి జిల్లా బాన్సువాడలో నూతన సర్పంచులకు సన్మానం
– ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా అంటూ కేటీఆర్ వ్యాఖ్యలపై స్పందన
నవతెలంగాణ-(బాన్సువాడ)బిచ్కుంద
గ్రామంలో మౌలిక సదుపాయాలు, సీసీ రోడ్లు, డ్రయినేజీలు, మంచినీటి సదుపాయాలు గ్రామానికి కావాల్సిన వాటిపై దృష్టి సారించి గ్రామస్తులకు అందుబాటులో ఉండి ప్రజాసేవ చేస్తే మరోసారి ప్రజలే పట్టం కడతారని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. బుధవారం కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని ఎస్‌ఎంబీ గార్డెన్‌లో నియోజకవర్గంలోని ఆయా గ్రామాల్లో నూతనంగా గెలుపొందిన సర్పంచులు, ఉపసర్పంచులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. నియోజకవర్గ ప్రజల సంక్షేమం అభివద్ధి ఎల్లప్పుడూ కోరుకునే వ్యక్తిగా ప్రజల ఆశీర్వాదంతో ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించారని అన్నారు. తన రాజకీయ జీవితంలో విమర్శలకు భయపడలేదని, ఇటీవల కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని అన్నారు. రాజకీయాల్లో హుందాతనం ఎంతో అవసరం అని హితవు పలికారు. సర్పంచులు ప్రతిరోజూ గ్రామమంతా తిరిగి ఎలాంటి సమస్యలు ఉన్నా వెంటనే పరిష్కరించాలని, ఏదైనా పెద్ద సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు. జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్ మాట్లాడుతూ.. బాన్సువాడ నియోజకవర్గంలో 111 సర్పంచ్ స్థానాలు కాంగ్రెస్ మద్దతు అభ్యర్థులు గెలవడం ఆషామాషీ కాదంటూ నూతనంగా ఎన్నికైన అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఎంపీ నిధుల నుంచి గ్రామాలకు అవసరమైన అన్ని రకాల మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తానన్నారు. త్వరలోనే పంచాయతీలకు నిధులు మంజూరు అవుతాయని, గ్రామాల అభివృద్ధికి సర్పంచులు తోడ్పడాలని తెలిపారు. అనంతరం నియోజకవర్గంలో నూతనంగా ఎన్నికైన సర్పంచులు ఉపసర్పంచులకు శాలువాలు, పూలమాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ మాజీ చైర్మెన్ పోచారం భాస్కర్‌రెడ్డి, నాయకులు బధ్యానాయక్, పోచారం సురేందర్‌రెడ్డి, మోహన్ నాయక్, మహమ్మద్ అజాజ్, వర్ని ఏఎంసీ చైర్మెన్ సురేష్‌బాబా, బీర్కూర్ ఏఎంసీ చైర్మెన్ శ్యామల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
గ్రామానికి మంచి చేయండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



