నవతెలంగాణ – భువనగిరి
జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ అధ్యక్షులు, జిల్లా న్యాయమూర్తి ఎ. జయరాజు వారి సూచనలమేరకు, వారి ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ఆవరణలో పోక్సో కోర్టు ప్రత్యేక అదనపు జిల్లా న్యాయమూర్తి మిలింద్ కాంబ్లీ పోక్సో కేసుల పరిష్కారం, బాధితుల రక్షణ, పునరావాసం అంశాలపై శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పి పి, పోలీసు, చైల్డ్ లైన్ శాఖలవారికి పోక్సో కేసుల పరిష్కారంలో జాప్యం జరుగకుండా ఉండటానికి తీసుకోవాల్సిన చర్యలపై తగు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి వి మాధవి లత, జె జె బి కోర్టు న్యాయమూర్తి స్వాతి, సి డబ్ల్యూ సి అధ్యక్షులు బండారు జయశ్రీ, బాల రక్ష భవన్ కోఆర్డినేటర్ అనంత లక్ష్మి, ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ జి రవీందర్ రెడ్డి, సఖి ఒన్ స్టాప్ సెంటర్ సెంట్రల్ అడ్మిన్ విన్ని, భువనగిరి టౌన్ ఎస్.ఐ నరేష్ పాల్గొన్నారు.
పోక్సో కేసుల పరిష్కారంలో జాప్యం చేయ్యవద్దు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



