– ప్రభుత్వం వారికి ఉద్యోగ భద్రత కల్పించాలి :
– టీఎన్జీవోస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ముజీబ్
నవతెలంగాణ-సిటీబ్యూరో
రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను తొలగించ వద్దని, ఎంతో కాలంగా కష్టపడి పనిచేస్తున్నవారికి ఉద్యోగ భద్రత కల్పించాలని టీఎన్జీవోస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్.ఎం.హుస్సేని(ముజీబ్) ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఆదివారం టీఎన్జీవోస్ యూనియన్ రాష్ట్ర కార్యాలయంలో ఆ సంఘం హైదరాబాద్ జిల్లా కార్యదర్శి కుర్రాడి శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించిన రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు ప్రభుత్వ నిబంధనలకు కట్టుబడి.. అధికారుల సూచనలను పాటిస్తూ పనిచేస్తున్నారని తెలిపారు. రాష్ట్రానికి ఆదాయం తీసుకొచ్చే శాఖల్లో రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ ఒకటని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో వివిధ శాఖల్లో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను తొలగిస్తుండటంతో వారు ఆందోళనకు గురవుతున్నారని అన్నారు. ప్రభుత్వం వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. ఈ అంశంపై ఇప్పటికే తమ ఉద్యోగుల సంఘం ‘త్రీ మెన్’ కమిటీ చైర్మెన్ నవీన్ మిట్టల్ (ఐఏఎస్)ను కలసి రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖలో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను తొలగించవద్దని విజ్ఞప్తి చేసినట్టు తెలిపారు. ఈ సమావేశంలో తెలంగాణ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగ సంఘం అధ్యక్షులు జగన్నాథం ప్రవీణ్, రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు మోతె శ్రీనివాస్ రెడ్డి, సభ్యులు మధుకర్, సమీయుద్దీన్, నరేష్, నాగరాజు, నాగేష్, జగన్, అన్వర్, ఇంద్రారెడ్డి, లక్ష్మణ్, రవీందర్, అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.
రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను తొలగించొద్దు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES