Saturday, July 19, 2025
E-PAPER
Homeకరీంనగర్అనుమతి లేనిదే మట్టి తవ్వకాలు చేయొద్దు..

అనుమతి లేనిదే మట్టి తవ్వకాలు చేయొద్దు..

- Advertisement -

అదనంగా 5 ట్రిప్పులు ఇవ్వాలని కమిటీల వినతి…
నవతెలంగాణ – తంగళ్ళపల్లి 

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు అందించే ఇసుక ఒక్క ట్రిప్పు రూ.1500లకే అందించాలని ట్రాక్టర్ యజమాలకు డిఆర్డిఓ శేషాద్రి, తాసిల్దార్ జయంత్ కుమార్ ఆదేశించారు. తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఇందిరమ్మ ఇళ్ల కమిటీలతో, మండల ట్రాక్టర్ యజమానులతో ఇంద్రమ్మ ఇళ్లపై సమీక్ష సమావేశాన్ని బుధవారం అధికారులు నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ… ఇందిరమ్మ ఇల్లు పూర్తయ్య వరకు పూర్తి బాధ్యత కమిటీ అన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు అందించే ఇసుక ఒక ట్రిప్పు రూ.1500 ల కే అందించాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు 10 ట్రిప్పులు ప్రభుత్వం ఉచితంగా అందిస్తుందన్నారు.

ఆ ఇసుకను బుధ శుక్రవారం లో మాత్రమే అనుమతులు ఇస్తామని,ఉదయం 9 గంటల నుండి ఒంటిగంట వరకు మాత్రమే ఈ ఇసుకను రవాణా చేయాలన్నారు. ఇందిరమ్మ ఇళ్లకు అవసరమయ్యే మట్టి ని మంగళ గురువారాల్లో అనుమతి తీసుకున్న తర్వాతనే తవ్వకాలు చేపట్టాలన్నారు. ఇసుక గాని, మట్టి గాని అనుమతులు లేకుండా అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా హెచ్చరించారు. అవసరాలను బట్టి మాత్రమే పంచాయతీ కార్యదర్శులు క్షేత్రస్థాయిలో పరిశీలించి ఇసుకకు, మట్టికి అనుమతుల కోసం ఉన్నతాధికారులకు సిఫార్సు చేయాలన్నారు. ప్రభుత్వ భూముల్లో కానీ, గుట్టల వద్ద గాని మట్టి తవ్వకాలను చేపడితే వాహనాలను సీజ్ చేయడమే కాకుండా, కేసులు నమోదు చేస్తామన్నారు.

నిర్ణీత ధరలకు అనుగుణంగా ఇందిరమ్మ ఇళ్లకు కావలసిన సరుకులను కమిటీలు వచ్చే విధంగా చూడాలని, ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా చూడాలన్నారు. ఇందిరమ్మ ఇల్లు నిర్మాణాలకు పది ట్రిప్పుల ఇసుక సరిపోదని, మరో ఐదు ట్రిప్పుల ఇసుకను ప్రభుత్వమే అందించే విధంగా చూడాలని ఇందిరమ్మ ఇళ్ల కమిటీలు అధికారులను కోరారు. ఈ సమావేశంలో ఎంపీడీవో లక్ష్మీనారాయణ హౌసింగ్ ఏఈ అబ్దుల్ హమీద్, ఎంపీ ఓ మీర్జా పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -