Saturday, July 5, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మైనర్ లకు వాహనాలు ఇవ్వొద్దు.!

మైనర్ లకు వాహనాలు ఇవ్వొద్దు.!

- Advertisement -

సరైన పత్రాలేని 72 వాహనాలు సీజ్
కాటారం డిఎస్పీ సూర్యనారాయణ
నవతెలంగాణ – మల్హర్ రావు
: మైనర్ పిల్లలకు ద్విచక్ర వాహనాలు ఇవ్వొద్దని కాటారం డిఎస్పీ సూర్యనారాయణ సూచించారు. కాటారం మండల కేంద్రంలో ద్విచక్ర, ఇతర వాహనాలు విస్తృతంగా తనిఖీలు చేపట్టి సరైన పత్రాలు లేకుండా తిరుగుతున్న 72 వాహనాలు సీజ్ చేసినట్లుగా తెలిపారు. ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడారు యువత గంజాయ్, మద్యపానం, గుడుంబా, మత్తు పదార్థాలు తీసుకొని వాహనాలు నడపరాదని అవగాహన కల్పించారు. మద్యం సేవించి ఇష్టమచ్చినట్లుగా రోడ్డుపై డ్రైవింగ్ చేయడంతో ఇతరులకు ఇబ్బందులు కలిగించడం, కొంతమంది అమాయకుల మరణాలకు కారణం కావడం జరుగుతుందన్నారు.

18 సంవత్సరాలు నిండిన యువత,డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవారు మాత్రమే ద్విచక్ర వాహనాలు నడపాలన్నారు.ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ నిబంధనల ప్రకారం హెల్మెట్ ధరించి నడపాలన్నారు. ముఖ్యంగా పిల్లలకు సెల్ పోన్స్ ఇవ్వరాదని, సెల్ ఫోన్ వాడడంతో చెడు వ్యసనాలకు అలవాటు పడటమే కాకుండా చిన్నతనంలోనే కళ్లు పోవడం జరుగుతుందన్నారు. యువత చట్టానికి వ్యతిరేకమైన కార్యకలాపాలకు పాల్పడి జీవితాన్ని నాశనం చేసుకోవద్దని సూచించారు. తల్లిదండ్రులు పిల్లలపై ఎప్పటికప్పుడు నిఘా పెట్టాలని, ఉన్నత చదువులు చదివేలా ప్రోత్సహించాలన్నారు. విద్యతో కుటుంబాన్ని, గ్రామాలను, సమాజాన్ని మార్చవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో కాటారం సిఐ నాగార్జున రావు, ఎస్ఐ అభినవ్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -