ట్రాఫిక్ పోలీసులకు హైకోర్టు ఆదేశం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
పెండింగ్ చలాన్లను రోడ్డుపైనే చెల్లించాలని వాహనదారులను బలవంతపెట్టొద్దని ట్రాఫిక్ పోలీసులను హైకోర్టు ఆదేశించింది. చలాన్లు చెల్లించాలని బైక్ కీస్ లాక్కోవడం, వాహనాన్ని ఆపేయడం లాంటివి చేయొద్దని తెలిపింది. వాహనం ఆపినప్పుడు వాహనదారులు స్వచ్ఛందంగా చలాన్లు చెల్లిస్తే పోలీసులు వసూలు చేసుకోవచ్చని కోర్టు పేర్కొంది. వాహనదారులు చెల్లించడానికి ఇష్టపడని పక్షంలో చట్టప్రకారం కోర్టు నోటీసులివ్వాలని ఆదేశించింది. ట్రాఫిక్ పోలీసులు బలవంతంగా చలాన్లు వసూలు చేస్తున్నారని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై న్యాయవాది విజరు గోపాల్ వాదనలు వినిపించారు. పెండింగ్ చలాన్ల వసూలు కోసం ట్రాఫిక్ పోలీసులు వాహనదారులను ఇబ్బందిపెడుతున్నారని పేర్కొన్నారు. దీంతో ట్రాఫిక్ పోలీసులకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
దామగుండంపై కేంద్రానికి హైకోర్టు నోటీసులు
వికారాబాద్ జిల్లా దామగుండం అటవీ భూముల్లో ఏర్పాటు చేస్తున్న రాడార్ ప్రాజెక్ట్ రెండో దశ అనుమతులపై స్టేటస్ రిపోర్టును సమర్పించాలని కేంద్రానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. రాడార్ ప్రాజెక్ట్ కోసం కేంద్రానికి 2,900 ఎకరాల దామగుండం అటవీ భూములను రాష్ట్ర ప్రభుత్వం బదలాయించింది. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దామగుండం ఫారెస్ట్ ప్రొటెక్షన్ జేఏసీ హైకోర్టులో పిల్ దాఖలు చేసింది. దీనిని చీఫ్ జస్టిస్ ఏకే సింగ్, జస్టిస్ మొహియుద్దీన్ డివిజన్ బెంచ్ మంగళవారం విచారించింది.
పెండింగ్ చలాన్లపై ఇబ్బంది పెట్టొద్దు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



