డెమోక్రిటివ్ టీచర్స్ పెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి తిరుపతి
నవతెలంగాణ – మల్హర్ రావు
రాష్ట్రంలో నేప్ -2020 విద్యా విధానాన్ని అమలు చేయడంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కొత్త కొత్త విధానాలు తీసుకొస్తుందని ఈ నేప్-2020ను రాష్ట్రంలో అమలు చేయవద్దని డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ భూపాలపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ తిరుపతి డిమాండ్ చేశారు.శుక్రవారం మహముత్తారం మండలం యామన్ పల్లిలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో డిటిఎఫ్ మండల శాఖ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన తిరుపతి మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యారంగం ఒక స్పష్టత లేకుండా ఒక విధివిధానం లేకుండా ప్రైవేటీకరణను ప్రోత్సహించే విధంగా ఉందని పేర్కొన్నారు.
ఈ మధ్యకాలంలో విద్యా కమిషన్ రిపోర్ట్ కూడా టీచర్లకు జీతాలు తక్కువ చేయాలనడం,పాఠశాలలను క్లబ్ చేయాలనడం లాంటి అంశాలతో పాటు ప్రస్తుతం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ అని చెపుతూనే మరోవైపు బడ్జెట్లో విద్యారంగానికి సుమారు 8% నిధులు కేటాయించడం అనేది ఒక గందరగోళ పరిస్థితిని సృష్టిస్తుందని పేర్కొన్నారు.
ప్రస్తుతం ఉన్న పాఠశాలల్లోనే అన్ని సౌకర్యాలు కల్పించి తరగతికి ఒక టీచర్ను,తరగతికి ఒక గదిని నిర్మించి రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులను నింపి పర్యవేక్షణ పెంచినట్టయితే విద్యారంగం కొంత గాడిన పడుతుందని పేర్కొన్నారు.అదేవిధంగా అన్ని ప్రాథమిక పాఠశాలలో ఫ్రీ ప్రైమరీ తరగతులను ప్రారంభించి రెసిడెన్షియల్ సిస్టమును పెట్టాలని డిమాండ్ చేశారు.జిల్లా కార్యదర్శి సిహెచ్ ప్రభాకర్,డిటిఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్ ఏ లక్ష్మణ్ నాయక్ మాట్లాడుతూ రాష్ట్రంలో పదవీ విరమణ పొందిన ఉద్యోగస్తులు వారి బెనిఫిట్స్ వారికి ఇవ్వాలని,గత కొన్ని నెలలుగా ఉద్యమాలు చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. అదేవిధంగా ఇప్పటికే ఐదు డిఏలు రావాలని పి ఆర్ సి గడువు దాటి మూడు సంవత్సరాలు అవుతుందని అయినా ఇప్పటికీ వాటి గురించి మాట్లాడకపోవడం శోచనీయమన్నారు.
ఈ కౌన్సిల్ సమావేశానికి మండల అధ్యక్షుడు జే రాంసింగ్ అధ్యక్షత వహించగా మండల ప్రధాన కార్యదర్శి బి విజయ్ కుమార్,మౌఖిక నివేదికను ప్రవేశపెట్టారు.అనంతరం మండల నూతన కమిటీని ఎన్నుకున్నారు.ఈ కమిటీ ఎన్నికకు ఎన్నికల పరిశీలకులుగా సిహెచ్ ప్రభాకర్ (జిల్లా కార్యదర్శి), ఎన్నికల అధికారిగా డిటిఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్ ఏ లక్ష్మణ్ నాయక్ వ్యవహరించారు. మండల అధ్యక్షులుగా జే రాంసింగ్ మరియు ప్రధాన కార్యదర్శిగా డి విజయ్ కుమార్ లు ఎన్నిక కాగా, ఉపాధ్యక్షులుగా జి భాస్కర్, డి రత్నకుమారి, జె రాజేంద్రన్, ఎం తిరుపతి, కార్యదర్శులుగా డి సంపత్, ఎం కవిత, ఆర్ రాజేంద్రప్రసాద్, కే వెంకటేష్, రజితలు ఎన్నిక కాగా, జిల్లా కౌన్సిలర్స్ గా A. తిరుపతి, సిహెచ్ ప్రభాకర్, హెచ్ దేవి సింగ్, బి భాగ్యలక్ష్మి, ఏ మల్లేష్, ఎల్ ప్రకాష్ లు ఎన్నికయ్యారు. ఆడిట్ కమిటీ కన్వీనర్ గా ఎండి షరీఫ్, సభ్యులుగా అనిల్ అరుణ అపర్ణ తదితరులు ఎన్నికయ్యారు.



