Saturday, August 30, 2025
E-PAPER
spot_img
Homeఖమ్మంనూనె ఉత్పత్తికి ఆటంకం కలిగించొద్దు: ఆయిల్ఫెడ్ డైరెక్టర్

నూనె ఉత్పత్తికి ఆటంకం కలిగించొద్దు: ఆయిల్ఫెడ్ డైరెక్టర్

- Advertisement -

నవతెలంగాణ – అశ్వారావుపేట : పామాయిల్ ప్యాక్టరీ నూనె ఉత్పత్తికి ఎటువంటి ఆటంకం కలిగించొద్దని ఆయిల్ఫెడ్ ఎక్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రశాంత్ కుమార్ పరిశ్రమల మేనేజర్ ఎం.నాగబాబు, ఇంజినీర్ పవన్ ను ఆదేశించారు. మరమ్మత్తులు ఉంటే గుర్తించి వెంటనే పనులు పూర్తి చేయాలని సూచించారు. స్థానిక పామాయిల్ పరిశ్రమ పనితీరును శనివారం వారు క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. 

ఫ్యాక్టరీ నిర్వహణ,గెలల దిగుమతి,నాణ్యతపై పలు సూచనలు చేశారు. అనంతరం నారంవారిగూడెం డివిజన్ కార్యాలయ ప్రాంగణంలో నర్సరీ ని తనిఖీ చేశారు. మొక్కల నాణ్యతను పరిశీలించారు. రైతులకు నాణ్యమైన మొక్కలను మాత్రమే పంపిణీ చేయాలని మొక్కల పంపిణీలో కనీస జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఆయన వెంట పీ అండ్ పీ మేనేజర్ జన్ను సత్యనారాయణ, జిల్లా ఇంచార్జి( డివిజనల్ ఆఫీసర్) నాయుడు రాధా క్రిష్ణ, క్షేత్ర సహాయకులు ఉన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad