ట్రంప్ ఆహ్వానాన్ని తిరస్కరించాలి : భారత ప్రభుత్వానికి ఐదు వామపక్షాల వినతి
న్యూఢిల్లీ : గాజా శాంతి ప్రణాళికను అమలు చేయడానికి ఉద్దేశించిన ‘బోర్డ్ ఆఫ్ పీస్’లో చేరాలంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పంపిన ఆహ్వానాన్ని ఆమోదించవద్దంటూ ఐదు వామపక్షాలు భారత ప్రభుత్వానికి గట్టిగా విజ్ఞప్తి చేశాయి. ఈ మేరకు సీపీఐ(ఎం), సీపీఐ, సీపీఐ(ఎంఎల్) లిబరేషన్, అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్, ఆర్‌ఎస్‌పీల నేతలు వరుసగా ఎం.ఎ.బేబీ, డి.రాజా, దీపంకర్ భట్టాచార్య, జి.దేవరాజన్, మనోజ్ భట్టాచార్యలు సంయుక్తంగా ఒక ప్రకటన విడుదల చేశారు. పాలస్తీనియన్ల హక్కులను ఏ మాత్రమూ గౌరవించని ఇటువంటి బోర్డులో చేరేందుకు భారత్ ఆమోదం తెలిపితే అది పాలస్తీనియన్ల ప్రయోజనాలకు తీవ్రమైన ద్రోహం చేసినట్లే కాగలదని వామపక్షాల నేతలు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
ఐక్యరాజ్య సమితిని ఉద్దేశ్యపూర్వకంగా పక్కదారి పట్టిస్తూ, అమెరికా నియంత్రణలో వుండే కొత్త అంతర్జాతీయ వ్యవస్థను ఏర్పాటు చేయాలన్నది ట్రంప్ ఉద్దేశమని, అందుకే ఈ ‘శాంతి బోర్డు’ ప్రతిపాదన చేశారని ఆ ప్రకటన విమర్శించింది. ప్రస్తుత మున్న అంతర్జాతీయ వ్యవస్థలను అధిగమించడానికి అమెరికా చేసే ప్రయత్నాన్ని ధృఢంగా తిరస్కరించాలని కోరారు. ఇటువంటి ప్రతిపాదనలకు భారత ప్రభుత్వం దూరంగా వుండాలని, అమెరికా సామ్రాజ్యవాద ఆకాంక్షలతో ముప్పును ఎదుర్కొంటున్న పాలస్తీనా, ఇతర తృతీయ ప్రపంచ దేశాల రక్షణకు కృత నిశ్చయంతో, ధృఢంగా నిలబడాలని వామపక్షాల నేతలు కోరారు.
బోర్డ్ ఆఫ్ పీస్‌లో చేరొద్దు
- Advertisement -
- Advertisement -



