Sunday, November 23, 2025
E-PAPER
Homeమానవిఫ్రిజ్‌లో అస్సలు పెట్టొద్దు…

ఫ్రిజ్‌లో అస్సలు పెట్టొద్దు…

- Advertisement -

నేటి కాలంలో ఫ్రిజ్‌ లేకుండా ఒక్క రోజు కూడా గడవలేని పరిస్థితి వచ్చింది. కూరగాయల నుంచి గుడ్లు, పాలు వరకు ప్రతిదీ రిఫ్రిజిరేటర్లలో నిల్వ చేస్తుంటారు. వండిన ఆహారంతో పాటు కూరగాయలను కట్‌ చేసి ఫ్రిజ్‌లో ఉంచుతుంటారు. కూరగాయలను కట్‌ చేసి గాలి చొరబడని డబ్బాలో లేదా జిప్‌లాక్‌ బ్యాగ్‌లో వేసి ఫ్రిజ్‌లో ఉంచుతుంటారు. అయితే ఉల్లిపాయలను ఎప్పుడూ ఫ్రిజ్‌లో నిల్వ చేయకూడదు..
ఉల్లిపాయ వాసన కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. ఇందులో సల్ఫర్‌ కూడా ఉంటుంది. అందువల్లనే ఉల్లిపాయలను కట్‌ చేసినప్పుడు కళ్ళలో నీళ్లు వస్తాయి. ఉల్లిపాయలను కట్‌ చేసి ఫ్రిజ్‌లో పెట్టడం వల్ల దానిలో బ్యాక్టీరియా పెరుగుతుంది.
ఉల్లిపాయ లను ఓపెన్‌ కంటైనర్‌లో లేదా రిఫ్రిజిరేటర్‌లో ఎప్పుడూ నిల్వ చేయకూడదు. ఇలా చేయడం వల్ల రిఫ్రిజిరేటర్‌లో నిల్వ చేసిన ఇతర ఆహారాలకు కూడా ఉల్లిపాయల వాసన వస్తుంది. ఉల్లిపాయ ముక్కలను ఫ్రిజ్‌లో ఎక్కువసేపు ఉంచడం వల్ల దానిలోని పోషక విలువలు పూర్తిగా నశిస్తాయి. వాటిని వంటల్లో వినియోగించడం వల్ల ప్రయోజనం ఉండదు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -