- Advertisement -
– డ్రగ్ ఇన్స్పెక్టర్ శ్రవణ్ కుమార్
నవతెలంగాణ – పెద్దపల్లి : నిషేధిత ఔషధాలను విక్రయించవద్దని, ఔషధాల రికార్డులను సక్రమంగా నిర్వహించాలని జిల్లా డ్రగ్ ఇన్స్పెక్టర్ శ్రవణ్ కుమార్ మెడికల్ షాపు యజమానులను ఆదేశించారు. పెద్దపెల్లి ఓదెల కాల్వ శ్రీరాంపూర్ మండలాలలో సోమవారం ఔషధ దుకాణాలలో తనిఖీలు నిర్వహించారు. జీఎస్టీ స్లాబ్ రేట్ ప్రకారం ఔషధాలు విక్రయించాలని సూచించారు. డాక్టర్ మందుల చీటీ లేకుండా ఔషధాలు విక్రయించవద్దని, నిషేధిత ఔషధాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
- Advertisement -



