Saturday, July 26, 2025
E-PAPER
Homeవరంగల్వర్షాలకు ఎరువులు, పురుగు మందులు స్ప్రే చేయకూడదు

వర్షాలకు ఎరువులు, పురుగు మందులు స్ప్రే చేయకూడదు

- Advertisement -

కాటారం మండల వ్యవసాయ అధికారిని పూర్ణిమ
పంటల సాగుపై సలహాలు, సూచనలు
నవతెలంగాణ-కాటారం

వర్షాలకు ఎరువులు, పురుగు మందులు స్ప్రే చేయకూడదు కాటారం మండల వ్యవసాయ అధికారిని పూర్ణిమ సూచించారు. పంటల సాగుపై రైతులకు సలహాలు, సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నత్రజని మూడు సమభాగాలుగా వేసి నాటుకు ముందు దమ్ములు అంకురం దశలో బురద పదునులో సమానంగా చల్లుకోవాలి. ఎరువులు చల్లిన 30 గంటల తర్వాత పొలానికి నీరు పెట్టడం ఉత్తమం అన్నారు. నత్రజనిని కాంప్లెక్స్‌ ఎరువుల రూపంలో, నానో యురియా రూపంలో అందించవచ్చు, శాస్త్రవేత్తల వ్యవసాయ అధికారుల సూచనల మేరకు యూరియాను తక్కువగా వినియోగించుకోవాలని వివరించారు. 40 కిలోల యూరియా 10 కిలోల వేప పిండి లేదా 250 కిలోల తేమ గలిగిన మట్టిని కలిపి రెండు రోజులు నిల్వ ఉంచి వేద జల్లితే నత్రజని వినియోగం పెరుగుతుందన్నారు. పచ్చిరొట్ల పైర్లు ముందుగానే సాగు చేసుకున్న రైతులు నాట్లకు 15 రోజులు ముందే దమ్ము చేసుకుని భూమిని చదును చేసుకోవాలన్నారు రేగడి భూముల్లో నాటు వేయడానికి రెండు రోజుల ముందే నీళ్లలో దమ్ము చేసి ఆ తర్వాత నాట్లు వేస్తే మంచిదన్నారు. నారు తీసేటప్పుడు మొక్కలు లేత ఆకుపచ్చగా ఉంటేనే నాటు త్వరగా కుదురుకుటుందని తెలిపారు. నాలుగు మంచి ఆరు ఆకులు ఉన్నా నారును ఉపయోగించాలన్నారు.. దీర్ఘ, మధ్య కాలిక నాట్లు వేసేటప్పుడు భూసారాన్ని అనుసరించి ప్రస్తుతం వానకాలం సీజన్‌లో చదరపు మీటరుకు 40 కుదుళ్ళు ఉండే విధంగా చూసుకోవాలన్నారు. నాటిన తర్వాత ప్రతీ 2 మీటర్లకఁ 20 సెం.మీ కాలిబాటలు తీసుకోవాలన్నారు. భూసారం తక్కువగా ఉన్న పొలాల్లో ఎక్కువ కుదుళ్లు భూసారం తక్కువగా ఉన్న పొలంలో ఎక్కువ కుదులు ఉండే విధంగా చూసుకోవాలన్నారు. ముదురు నారును నాటినప్పుడు కుదుళ్ళ సంఖ్యను పెంచి 4 నుంచి 5 మొక్కలు చొప్పున నాటుకోవాలన్నారు. భాస్వరం ఎరువులతో కలిపి జింక్‌ సల్ఫేట్‌ని వేయకూడదు, కనీసం మూడు రోజుల వ్యవధి ఉండాలన్నారు. బాస్వరంలో జింకును కలిపి వేయడం వలన రసాయ‌నికి చర్య జరిగి, పంటకు ఫలితం ఉండదన్నారు. జింక్‌ సల్పేట్‌ ద్రావణంలో సైతం తెగులు మందులు కలపరాదన్నారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారుల సూచనలతో ఎరువులు, చీడపీడల నివారణ చర్యలు చేపట్టడం ఉత్తమం అని వివరించారు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -