Saturday, August 30, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయం'కరేడు' గిరిజనులపై చర్యలు తీసుకోవద్దు

‘కరేడు’ గిరిజనులపై చర్యలు తీసుకోవద్దు

- Advertisement -

పోలీసులకు జాతీయ ఎస్టీ కమిషన్‌ ఆదేశం
నవతెలంగాణ బ్యూరో -హైదరాబాద్‌

‘కరేడు’ భూ సేకరణ ఉద్యమంలో పాల్గొన్న గిరిజనులపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దనీ, భూ సేకరణ నిలిపి వేయాలని జాతీయ ఎస్టీ కమిషన్‌ ప్రభుత్వాన్ని ఆదేశించింది. తమను వేధిస్తున్న పోలీసులపై చర్యలు తీసుకోవాలన్న ఉలవపాడు గిరిజన మహిళల ఫిర్యాదులపై జాతీయ ఎస్టీ కమిషన్‌ సభ్యులు జాటోత్‌ హుస్సేన్‌ నాయక్‌ శుక్రవారం హైదరాబాద్‌లోని దిల్‌ ఖుషా అతిథి గృహంలో విచారణ చేపట్టారు. బాధిత గిరిజన మహిళలు మాణికల శిరీష, మాణికల సుజాత, మల్లవరపు లలిత. ఆదివాసీ అధికార్‌ రాష్ట్రీయ మంచ్‌ జాతీయ కార్యవర్గ సభ్యులు రమావత్‌ శ్రీరాంనాయక్‌, సీపీఐ(ఎం) ఉలవపాడు ప్రాంతీయ కమిటీ కార్యదర్శి జీవీబీ కుమార్‌, గిరిజన సంఘం నాయకులు రాంబాబు, వెంకటేశ్వర్లు విచారణకు హాజరయ్యారు. పోలీసులు తరఫున కందుకూరు డిఎస్పీ బాలసుబ్రమణ్యం హాజరయ్యారు. ఎస్టీ కమిషన్‌ ముందు బాధిత మహిళలు వాంగ్మూలం ఇచ్చారు. ఇండో సోల్‌ కంపెనీకి తమ భూములు ఇస్తే తీవ్రంగా నష్టపోతామనీ, ప్రయివేటు కంపెనీకి తమ భూములు, ఇండ్లు ఇచ్చేది లేదని తీర్మానించామని తెలిపారు. శాంతియుతంగా నిరసన తెలిపితే పోలీసులు తమపై తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపారనీ, ఇప్పటికీ పోలీసులు బెదిరిస్తున్నారని వారు కమిషన్‌ దృష్టికి తీసుకెళ్లారు .

సీరియస్‌గా స్పందించిన కమిషన్‌…
ప్రయివేటు సోలార్‌ కంపెనీకి వేల ఎకరాల భూములు ఎందుకు అవసరమవుతాయని హుస్సేన్‌ నాయక్‌ ఈ సందర్భంగా ప్రశ్నించారు కంపెనీకి చేస్తున్న భూసేకరణ, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, పోలీసుల వ్యవహరిస్తున్న తీరుపై 15 రోజుల్లోపు సమగ్ర నివేదిక ఇవ్వాలని పోలీసులను కమిషన్‌ ఆదేశించింది. అంతవరకు గిరిజనులపై పెట్టిన కేసుల్లో తదుపరి చర్యలు తీసుకోవద్దని పోలీసులకు స్పష్టంచేసింది. బాధితుల కాలనీల్లో తానే స్వయంగా పర్యటిస్తాననీ, అప్పటివరకు భూ సేకరణ నిలిపివేయాలని ఎస్టీ కమిషన్‌ సభ్యులు హుస్సేన్‌ నాయక్‌ అధికారులను ఆదేశించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad