– ఆయన వాదన, ప్రచారమంతా అబద్ధం
– కేరళంలో వామపక్ష ప్రభుత్వ అద్భుత పాలన కొనసాగాలి
– ఎల్డీఎఫ్ను గెలిపించండి
– కేరళం ఓటర్లకు కల్వకుంట్ల కవిత వీడియో
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి చేస్తున్న వాదన, ప్రచారమంతా అబద్ధమనీ, ఆయన పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ జాగతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కేరళం ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంగళవారం ఎక్స్ వేదికగా ఆమె ఇంగ్లీషులో వీడియో సందేశాన్ని విడుదల చేశారు. కేరళం సీఎం విజయన్ నేతత్వంలోని వామపక్ష ప్రభుత్వ పాలన అద్భుతంగా ఉందనీ, ఆ పాలనను కొనసాగించేలా ఎల్డీఎఫ్కు, విజయన్‌కు ఓటు వేయాలని ఆమె కోరారు. తెలంగాణలో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తప్ప మరేదీ అమలు చేయలేదని గుర్తుచేశారు. కాంగ్రెస్ కేరళం ప్రజల్ని మోసం చేస్తుందన్నారు. తెలంగాణలో హామీలిచ్చారే తప్ప, ఉద్యోగాలు, రైతులకు బోనస్, వద్ధులకు పింఛన్, బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వలేదని వివరించారు. తెలంగాణలో కాంగ్రెస్ చరిత్ర అంతా అవినీతి, మోసంతో కూడుకుని ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణను ఏటీఎం సెంటర్‌గా మార్చుకుందనీ, ఇక్కడి అవినీతి సొమ్ముతో రేవంత్‌రెడ్డి కేరళం వస్తున్నారని విమర్శించారు. ”స్వేచ్ఛాయుతమైన ఆలోచనలు బతకాలి. లెఫ్ట్ ప్రభుత్వం కొనసాగాలి. విజయన్ పాలన అద్భుతంగా ఉంది. తెలంగాణ సీఎంను నమ్మొద్దు. ఆయన వాదన, ప్రచారమంతా అబద్ధమే. లెఫ్ట్‌కు, విజయన్ కు ఓటు వేయండి” అని కవిత కేరళం ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. త్వరలో తెలంగాణలో నూతన రాజకీయ పార్టీని ప్రారంభిస్తున్నట్టు ఆమె ప్రకటించారు.
తెలంగాణ సీఎంను నమ్మొద్దు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



