నవతెలంగాణ -ముధోల్
ధాన్యం తడిసిన ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రైతులు అధైర్యపడవద్దు అని తహశీల్దార్ శ్రీలత అన్నారు. ముధోల్ మండలంలోని చించాల, వెంకటాపూర్, ఎడ్ బిడ్, వరి కొనుగోలు కేంద్రాలను గురువారం రోజు తహశీల్దార్ పరిశీలించారు. తడిసిన ధాన్యాన్ని పరిశీలించి పలు వివరాలను రైతులు, కొనుగోలు కేంద్ర నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. వెంట వెంటనే ధాన్యాన్ని తూకం వేసి లారీలో వెంటనే రైస్ మిల్లుకు తరలించాలని నిర్వాహకులకు సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి ఆలస్యం చేయవద్దనిఅని అన్నారు. ఈ సందర్భంగా రైతులతో తహశీల్దార్ మాట్లాడారు. ప్రభుత్వం చివరి గింజ వరకు కొనుగోలు చేస్తుందన్నారు. ఎలాంటి ఆందోళన గురి కావద్దన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ నారాయణ రావు పటేల్, నిర్వాహకులు, రైతులు,ఉన్నారు.
వర్షంతో రైతులు ఆందోళన పడవద్దు…
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES