Saturday, September 20, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంప్రాధాన్యత క్రమంలో పనులు చేయండి

ప్రాధాన్యత క్రమంలో పనులు చేయండి

- Advertisement -

– మౌలిక, వసతుల కల్పన సబ్‌కమిటీ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

అభివృద్ధి పనులను అధికారులు శాఖల వారీగా ప్రాధాన్యత క్రమంలో గుర్తించాలని డిప్యూటీ సీఎం, మౌలిక, వసతుల కల్పన సబ్‌ కమిటీ చైర్మెన్‌ మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన మంత్రుల సబ్‌కమిటీలో భట్టితో పాటు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. 1:3 శాతం చొప్పున ప్రతిపాదనలు తీసుకురావాలనీ, సంవత్సరాల వారీగా ప్రాధాన్యత క్రమంలో విభజన చేయాలని సూచించారు. ఆ మేరకు అన్ని శాఖల ప్రధాన కార్యదర్శులు వారంలోగా పూర్తిస్థాయి ప్రతిపాదనలతో సమావేశానికి రావాలని ఆదేశించారు. న్యామ్‌ రోడ్ల పనులకు సంబంధించిన టెండర్ల ప్రక్రియను వేగవంతం చేయాలని ఆర్‌అండ్‌బి, పంచాయతీరాజ్‌ శాఖ అధికారులకు సూచించారు. ఆర్‌అండ్‌బి, పంచాయతీరాజ్‌, పోలీస్‌ శాఖలో వచ్చిన ప్రతిపాదనలను సమావేశంలో సమీక్షించారు. సమావేశంలో చీఫ్‌ సెక్రటరీ రామకృష్ణారావు, పంచాయతీరాజ్‌ శాఖ ప్రధాన కార్యదర్శి శ్రీధర్‌, వివిధ శాఖల కార్యదర్శులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -