ఇద్దరు బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యేలను ప్రశ్నించిన సిట్
విచారణకు హాజరైన జైపాల్ యాదవ్, లింగయ్య
అదనపు ఎస్పీ తిరుపతన్నతో వీరికి ఉన్న లింక్‌పై ఆరా
ఫోన్‌ట్యాపింగ్ కేసులో పలు ప్రశ్నలు సంధించిన అధికారులు
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిది
ఫోన్‌ట్యాపింగ్ కేసులో బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్, చిరుమర్తి లింగయ్యలను సిట్ అధికారులు గురువారం ప్రశ్నించారు. సిట్ ఇచ్చిన నోటీసుల మేరకు ఇద్దరు మాజీలు జూబ్లీహిల్స్‌లోని సిట్ కార్యాలయం ఎదుట విచారణకు హాజరయ్యారు. ఫోన్‌ట్యాపింగ్ వ్యవహారంలో వీరికి, ఈ కేసులో నిందితులైన అధికారులతో ఉన్న సంబంధాలపై సిట్ అధికారులు సుదీర్ఘంగా ప్రశ్నించారు. ఫోన్‌ట్యాపింగ్‌కు పాల్పడ్డ అధికారులతో వీరు ఎవరి ఫోన్లను ట్యాపింగ్ చేయించారనే అనే సమాచారాన్ని కూపీ లాగడానికి అధికారులు ప్రయత్నించారు. ముఖ్యంగా ఈ కేసులో నిందితుడైన అదనపు ఎస్పీ తిరుపతన్నను లింగయ్య ఎదుట కూర్చోబెట్టి వారిద్దరి మధ్య ఉన్న సంబంధాల గురించి ప్రశ్నించారు. తిరుపతన్నకు లింగయ్య ఫోన్ నుంచి వెళ్లిన సందేశాల గురించి నిలదీసినట్టు తెలిసింది. మొత్తం మీద జైపాల్‌యాద్, లింగయ్యలను ఫోన్‌ట్యాపింగ్‌కు సంబంధించి పలు ప్రశ్నలతో విచారణను అధికారులు కొనసాగించినట్టు సమాచారం.
ఫోన్‌ట్యాపింగ్‌తో నాకేం సంబంధమూ లేదు : లింగయ్య
ఫోన్‌ట్యాపింగ్ కేసుతో తనకు ఎలాంటి సంబంధమూ లేదని మాజీ ఎమ్మెల్యే లింగయ్య అన్నారు. సిట్ విచారణ ముగిశాక వెలుపలికి వచ్చిన లింగయ్య కొద్దిసేపు మీడియాతో మాట్లాడారు. అదనపు ఎస్పీ తిరుపతన్నతో తనకేమన్న సంబంధాలున్నాయా అని ప్రశ్నించారని ఆయన తెలిపారు. ఫోన్‌ట్యాపింగ్‌లు అనేవి పోలీసు అధికారులు, వారికి ఉన్న నిబంధనల మేరకు చేస్తుంటారనీ, వాటి గురించి తనకేమీ తెలియదని లింగయ్య అన్నారు. తన ఫోన్ నుంచి ఎవరో తిరుపతన్నకు మెసేజ్‌లు చేశారనీ, ఆ విషయంలో తనకేం సమాచారమూ లేదనీ, వాటి గురించే ఎక్కువగా ప్రశ్నించారని మాజీ ఎమ్మెల్యే తెలిపారు.
నిందితులతో సంబంధాలున్నాయా?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



