Monday, July 7, 2025
E-PAPER
Homeదర్వాజప్రపంచాన్ని మార్చే శక్తి ఎవరికి ఉంటుందో తెలుసా?

ప్రపంచాన్ని మార్చే శక్తి ఎవరికి ఉంటుందో తెలుసా?

- Advertisement -

ఈ ఉరుకుల పరుగుల బ్రతుకు చక్రాన్ని కొంత సమయం వరకు ఆపి, ప్రశాంతంగా ఊపిరి పీల్చుకొని, నిద్రపోయి కలలు కనేవారు. కలలు కనే వారు ఈ ప్రపంచాన్ని మార్చడం ఏంటి అని అంటారా ?? అయితే మీరు ఈ కథ గురించి తెలుసుకోవాల్సిందే. 16వ దశాబ్దంలో స్పెయిన్‌ రాజ్యంలో సాంటియాగో అనే ఒక యువకుడు ఉండేవాడు. ఒక యుక్త వయసు వచ్చిన తర్వాత తాను తన దేశం మొత్తం తిరగాలని వాళ్ళ అమ్మానాన్నలతో కోరుతాడు. అప్పుడు వాళ్ళ నాన్న దానికి ఒకటే మార్గం అంటూ కొన్ని గొర్రెలను కొనిచ్చి వాటిని మేపుతూ ఈ దేశం మొత్తం ప్రయాణించు అని చెబుతాడు. అలా వాళ్ళ దేశం మొత్తం ప్రయాణం మొదలుపెడతాడు సాంటియాగో, ప్రయాణం మధ్యలో ఒక రోజు ఒక చెట్టు కింద కూర్చొని నిద్రపోతు ఒక కల కంటాడు. ఆ కలలో తాను ఒక నిధి దగ్గరికి ప్రయాణించినట్లు నిధి మొత్తం తన సొంతం అయినట్లు కల కంటాడు.


నిద్రలేచిన తర్వాత కూడా ఆ స్వప్నాన్ని శ్వాసిస్తూ ఉంటాడు. నిద్రలో వచ్చిన కల నిద్రపట్ట నివ్వదు. ఇప్పుడు సాంటియాగో కు జీవితానికి గమ్యం తెలుసు కానీ ఆ గమ్యానికి మార్గం తెలియదు. అప్పుడే తారసపడ్డ జాతకాలు చెప్పే ముసలవ్వ కనపడటంతో తన కల గురించి మొత్తం చెప్పేసాడు. నువ్వు కన్న కలలు నిజమవుతాయి అని ముసలవ్వ చెప్పడంతో తన దగ్గర ఉన్న గొర్రెలు మొత్తం అమ్మి. ముసలవ్వ చెప్పిన మార్గంలో ప్రయాణం మొదలుపెడతాడు. ఆ ప్రయాణంలో మెల్కిజిడెక్‌ అనే రాజును కలుస్తాడు. ఆ రాజు నువ్వు అనుకున్నది ఎంత బలంగా కోరుకుంటావో అది తప్పకుండా జరుగుతుంది అని చెప్పి సాంటియాగో ప్రయాణానికి సహాయపడతాడు. ఆఫ్రికాలోని టాంజియర్‌ నగరానికి వెళ్లి చేరతాడు సాంటియాగో. అక్కడ వెంటనే ఒక దొంగ అతన్ని మోసం చేసి డబ్బంతా మాయం చేస్తాడు. ఇంతవరకు జరిగిందేదో జరిగింది తాను మళ్లీ స్పెయిన్‌ కి వెళ్ళిపోదామని అనుకుంటాడు వెళ్లడం కోసం డబ్బు కావాలి. ఆ డబ్బు కోసం ఒక ముసలి వ్యక్తి దుకాణంలో పనిచేయడం మొదలు పెడతాడు. అతి తక్కువ ఆదాయం ఉండే ఆ దుకాణాన్ని ఆ ప్రదేశంలోనే అతి ఎక్కువ ఆదాయంగా వచ్చే రీతిగా మారుస్తాడు. తన దగ్గర తగినంత ధనం రాగానే ఆ ముసలి వ్యక్తి తన నిధి కలను మళ్లీ గుర్తు చేస్తాడు. ఇప్పుడు తనకు రెండు మార్గాలు ఒకటి ఆ దుకాణంలోనే పనిచేస్తూ మరింత డబ్బు సంపాదించడం లేకపోతే వచ్చిన కొద్దిపాటి డబ్బుతో సరిపెట్టుకొని తన కల కోసం ప్రయాణం సాగించడం. తాను రెండోవ మార్గాన్ని ఎంచుకుంటాడు. ఈజిప్ట్‌ లోని పిరమిడ్స్‌ వైపు తన ప్రయాణాన్ని సాగిస్తాడు. మార్గమధ్యంలో ఒక ఆంగ్ల మనిషిని కలుస్తాడు. ఆ మనిషిది ఆల్కెమిస్ట్‌ గురించి చెబుతాడు. ఆల్కెమీ అంటే మానవ మనస్సు, ప్రకతి శక్తులతో కలసి పిడికిలిని బంగారంగా మార్చే శాస్త్రం. అలా సాగుతున్న తన ప్రయాణంలోకి ఒక ఊరు, ఆ ఊరికి ఒక సమస్య, అందులో ఉండే అందమైన అమ్మాయి ఫాతిమా. ఆ ఊరి సమస్య, ఆ అమ్మాయి ప్రేమలో పడేసరికి చాలా సమయం సాగిపోతుంది.


మళ్లీ చివరికి రెండు చిక్కులు ఒకటి ప్రేమించిన ఆ ఫాతిమాను పెళ్లి చేసుకొని ఆ ఊర్లోనే బ్రతకడం లేక తన కలల కోసం ప్రయాణించడం. ఫాతిమా కూడా నీ కలల కోసం ప్రయాణించు అని చెప్పడంతో. ప్రయాణం సాగించి పిరమిడ్స్‌ చేరుకుంటాడు. అక్కడ నిధి కోసం తవ్వుతూ ఉండగా, కొంతమంది దొంగలు అతనిపై దాడి చేస్తారు. అప్పుడు తన కల గురించి చెబుతాడు. ఒక దొంగ నవ్వుతూ చెబుతాడు ”నాకు కూడా ఓ కల వచ్చింది! స్పెయిన్‌ లో ఒక పాత చర్చిలో, ఒక తిమ్మ చెట్టుకింద బంగారం ఉంది. కానీ నేనిప్పుడు నా కలను నమ్మలేదు. సాంటియాగోకి అర్థమవుతుంది. నిజమైన నిధి తన కల మొదలైన చోటే ఉంది. అంటే తన స్వగ్రామంలో ఉన్న పాత చర్చిలో, తిమ్మచెట్టు క్రింద. తాను అక్కడికి తిరిగి వెళ్ళి తవ్వితే నిజంగా బంగారం, ఆభరణాలతో కూడిన నిధి దొరుకుతుంది!! నువ్వు నిద్రలో కన్నా కల కోసం,, నిజజీవితంలో అన్ని వదిలేస, అసాధ్యమైన ఆ కల కోసం ప్రయాణించడం, ఆ సమయంలో నిజజీవితంలో ఎన్నో సంఘటనలు నిన్ను ఆపడానికి ప్రయత్నించిన అసాధ్యమైన కలను సాధ్యం చేసుకోవడం. ఇలాంటి వాళ్లే ప్రపంచాన్ని మార్చగలిగే శక్తివంతులు.
మనకు నిజంగా ఏదైనా కావాలంటే, విశ్వం కూడా అది సాధించడంలో మనకు సహాయం చేస్తుంది. మన ప్రయాణం మనల్ని మారుస్తుంది. నిజమైన ప్రేమ మన కలల్ని ప్రోత్సహిస్తుంది. ఈ పుస్తకం నా జీవితానికి ఒక మార్గాన్ని చూపింది. స్ఫూర్తి నింపింది.


రచయిత గురించి : పాలో కోయెలో బ్రెజిల్‌కు చెందిన ప్రముఖ రచయిత. అతని జీవితమే ఒక స్ఫూర్తి ప్రయాణం – యువకుడిగా రచయిత కావాలన్న కల, కుటుంబ ప్రతిబంధకాలు, మానసిక ఆసుపత్రిలో గడిపిన కాలం, ఆత్మోన్నతికి చేసిన ప్రయత్నాలు ఇవన్నీ అతని రచనల్లో ప్రతిబింబిస్తాయి. ‘ది ఆల్కెమిస్ట్‌’ నవల 1988లో పోర్చుగీస్‌లో వెలువడింది. ఇది ప్రపంచవ్యాప్తంగా 80కి పైగా భాషల్లో అనువాదమైంది.
– జింకా వరుణ్‌

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -