నవతెలంగాణ – చిన్నకోడూరు
సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల కేంద్రానికి గ్రామానికి చెందిన బంక శ్రీశైలం కు ప్రఖ్యాతిగాంచిన ఉస్మానియా విశ్వవిద్యాలయం ద్వారా జంతుశాస్త్ర విభాగంలో “జూప్లాంక్టన్ డైవర్సిటీ అండ్ కంపారిటీవ్ స్టడీ ఆఫ్ వాటర్ క్వాలిటీ ప్రాపర్టీస్ ఇన్ శనిగరం అండ్ సింగరాయ రిజర్వాయర్స్ ఇన్ సిద్దిపేట డిస్టిక్ తెలంగాణ స్టేట్ ” అనే అంశంపై ప్రొఫెసర్. A.V. రాజశేఖర్ డిపార్ట్మెంట్ ఆఫ్ జువాలజీ ఉస్మానియా యూనివర్సిటీ పర్యవేక్షణలో పరిశోధన చేసినందుకు ఉస్మానియా యూనివర్సిటీ డాక్టరేట్ పట్టాను మంగళవారం అందజేసినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కష్టపడి చదివితే ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించారు. సమాజంలో గౌరవం పేదరికం పోవాలంటే చదివే చక్కటి మార్గమన్నారు. ప్రస్తుతం తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల,కళాశాల (బాలురు) చిన్నకోడూరు, గుర్రాలగొంది లో జంతుశాస్త్రం లెక్చరర్ గా పనిచేస్తున్నట్టు తెలిపారు. చిన్న కోడూరు గ్రామానికి చెందిన బంక శ్రీశైలం మధ్యతరగతి కుటుంబానికి చెందిన బంక దేవవ్వ మల్లేశం గార్లకు మూడవ కుమారుడు అయిన శ్రీశైలం ప్రభుత్వ పాఠశాల చిన్నకోడూరు యందు ఉన్నత విద్యను, ప్రభుత్వ డిగ్రీ కళాశాల సిద్దిపేట నుండి డిగ్రీ , ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి జంతుశాస్త్రం విభాగంలో పీజీ పూర్తి చేసి , సుమారుగా 10 సంవత్సరాలు ప్రభుత్వ డిగ్రీ కళాశాల సిద్దిపేట యందు అతిథి అధ్యాపకునిగా జంతుశాస్త్ర విభాగములో పనిచేసినారు.
కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో 2019లో సాంఘిక సంక్షేమ గురుకులంలో ఉద్యోగాన్ని సాధించి పట్టుదలతో ఉస్మానియా యూనివర్సిటీలో పి హెచ్ డి పూర్తి చేసి ఎంతో మంది విద్యార్థులకు మార్గదర్శకంగా నిలిచాడన్నారు. తనలోని తపన కష్టపడే తత్వం డాక్టరేట్ సాధించడం పట్ల జిల్లా ప్రముఖులు ,కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు ,ఉపాధ్యాయ, అధ్యాపక బృందం అభినందించారు.



