Friday, November 21, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కొరిపల్లి వాసి సుధీర్ కుమార్ కు డాక్టరేట్ 

కొరిపల్లి వాసి సుధీర్ కుమార్ కు డాక్టరేట్ 

- Advertisement -

• అర్థశాస్త్రం విభాగంలో ఓయూ నుంచి పట్టా
నవతెలంగాణ -పెద్దవంగర
మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలంలోని కొరిపల్లి గ్రామానికి చెందిన బొచ్చుల సుధీర్ కుమార్‌ ఉస్మానియా యూనివర్సిటీ నుండి డాక్టరేట్ పట్టా అందుకున్నారు. అర్థశాస్త్రం విభాగంలో ప్రొఫెసర్ జాడి నరసింహారావు పర్యవేక్షణలో “తెలంగాణలో చేనేత పరిశ్రమ సామాజిక-ఆర్థిక విశ్లేషణ” అనే అంశంలో పరిశోధన చేశారు. ఈ సందర్భంగా సుధీర్ కుమార్ మాట్లాడుతూ.. తన తల్లిదండ్రులు రత్నమ్మ – చంద్రయ్య ల కృషి, త్యాగం, విద్య నేర్పిన గురువులు, డాక్టర్„ బీఆర్ అంబేద్కర్ స్పూర్తి వల్లనే నేను డాక్టరేట్ అందుకున్నానని పేర్కొన్నారు. పీహెచ్డీ పట్టా సమాజం పట్ల నా బాధ్యతను మరింత పెంచిందని, సమాజ శ్రేయస్సు కోసం తన వంతుగా పాటుపడుతానని తెలిపారు. కాగా సుధీర్ కుమార్ కు డాక్టరేట్‌ రావడం పట్ల ప్రొఫెసర్లు, ఉద్యమకారులు, విద్యార్థి సంఘాల నాయకులు, కుటుంబ సభ్యులు, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -