Monday, December 8, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పల్లె దవాఖానాకు డాక్టర్ల డుమ్మా

పల్లె దవాఖానాకు డాక్టర్ల డుమ్మా

- Advertisement -

నవతెలంగాణ – కాటారం 
ప్రజలకు వైద్య సేవలు అందించే పల్లె దవాఖాన వైద్యుల గైర్హాజరితో వెలవెల బోతోంది. ప్రభుత్వం ప్రతిష్టమకంగా ఏర్పాటు చేసిన పల్లె దవాఖాన వైద్యులు లేక బోసి పోతోంది. వివరాలలోకి వెళితే కాటారం మండలంలోని చింతకాని గ్రామపంచాయతీ పరిధిలో గల పల్లె దవాఖానలో వైద్యులు విధులు నిర్వహించకుండా డ్యూటీకి డుమ్మా కొడుతున్నారు. దీంతో దవాఖానకు వచ్చే రోగులు మండల కేంద్రానికి వెళ్లే దుస్థితి దాపురించిందని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పల్లె దావకానలో పనిచేసే సిబ్బంది ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు దవాఖానాలో ప్రజలకు అందుబాటులో ఉండి వైద్య సేవలు అందించాలి.

కానీ ఇక్కడ మాత్రం అధికారులు డ్యూటీ కి డుమ్మా కొడుతుండడంతో రోగులు అవస్థలు పడుతున్నారు.ఉన్నతాధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడంతో ఇష్టారి తిన వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఇదే విషయంపై కాటారం పిహెచ్సి ట్రాక్టర్ మౌనికను నవతెలంగాణ చరవాణిలో సంప్రదించగా అధికారులు ఉదయం తొమ్మిది గంటల నుండి నాలుగు గంటల వరకు అందుబాటులో ఉండాలని వివరణ ఇచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -