– గర్భిణికి చెకప్ చేయకుండానే రాసిన మందులు
– ఇంటికెళ్లాక ప్రసవం.. శిశువు మృతి
– ఆస్పత్రి ఎదుట బాధిత బంధువుల నిరసన
నవతెలంగాణ – భువనగిరి
కడుపు నొప్పితో ఆస్పత్రికి వచ్చిన ఏడు నెలల గర్భిణిని వైద్యురాలు ప్రత్యక్షంగా పరిశీలించకుండానే ఫోన్‌లో మందులు సూచించడంతో.. అప్పుడే పుట్టిన శిశువు మృతి చెందిందంటూ బాధిత కుటుంబీకులు ఆందోళనకు దిగారు. ఈ సంఘటన యాదాద్రిభువనగిరి జిల్లా కేంద్రంలోని ప్రిన్స్ ఆస్పత్రిలో మంగళవారం జరిగింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. యాదగిరిగుట్ట యాదగిరిపల్లికి చెందిన ప్రశాంత్ భార్య తేజస్విని ఏడు నెలల గర్భిణి. కడుపు నొప్పి రావడంతోపాటు కాళ్లు గుంజుతున్నాయని ఆమె సోమవారం ప్రిన్స్ ఆస్పత్రికి వచ్చింది. డాక్టర్ అందుబాటులో లేకపోవడంతో అక్కడ ఉన్న నర్సు తేజస్వినికి సంబంధించిన రిపోర్టులను మొబైల్ ద్వారా డాక్టర్‌కు పంపించింది. ఫోన్‌లో రిపోర్టులు చూసిన డాక్టర్.. గర్భిణిని ప్రత్యక్షంగా పరిశీలించకుండానే పలురకాల మందులు వాడాలని సూచించారు. ఆ మందులు వాడిన తర్వాత మళ్లీ మరుసటి రోజు ఆస్పత్రికి రావాలని నర్సు చెప్పింది. అయితే, ఇంటికి వెళ్లాక తేజస్వినికి నొప్పులు తీవ్రమై ప్రసవమైంది. పుట్టిన పాపను తీసుకుని కుటుంబీకులు వెంటనే మరో ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే శిశువు మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. దాంతో ప్రిన్స్ ఆస్పత్రి వైద్యులు సూచించిన మందులు వాడటంతోనే శిశువు మృతి చెందిందని ఆరోపిస్తూ బాధిత కుటుంబీకులు మంగళవారం ఆస్పత్రి ఎదుట ఆందోళన చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని యాజమాన్యంతో మాట్లాడి న్యాయం చేస్తామని చెప్పడంతో ఆందోళన విరమించారు.
వైద్యురాలి నిర్లక్ష్యం!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES