No menu items!
Monday, August 25, 2025
E-PAPER
spot_img
No menu items!
Homeతెలంగాణ రౌండప్వైద్యులు సొంత గ్రామాలను దత్తత తీసుకోవాలి..

వైద్యులు సొంత గ్రామాలను దత్తత తీసుకోవాలి..

- Advertisement -

మల్లక్కపేటలో ఉచిత మెగా వైద్యశిబిరంలో ఎమ్మెల్యే రేవూరి 
నవతెలంగాణ – పరకాల 

వైద్య వృత్తిలో ఉన్నవారు తమ గ్రామాలను దత్తత తీసుకొని ప్రజలకు వైద్య సేవలు అందించాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం పరకాల మండలం మల్లక్కపేటలో ఐఎంఎ సౌజన్యంతో దొమ్మటి ప్రసన్నకుమార్ రాజేశ్వరి దంపతులు సొంత గ్రామానికి వైద్య సేవలు అందించాలనే సంకల్పంతో గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో మెగా ఉచిత వైద్య శిబిరం ఏర్పరచడం జరిగింది.ఈ వైద్య శిబిరాన్ని పురస్కరించుకొని ఎమ్మెల్యేతో కలిసి దొమ్మటి సాంబయ్య కుటుంబ సభ్యులు పాఠశాల ఆవరణలో మొక్కలు నాటడం జరిగింది.

అనంతరం దొమ్మటి సాంబయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ .. ప్రస్తుత సమాజంలో విద్యా వైద్యం అత్యంత ప్రాధాన్యతతో కూడిన అంశాలుగా మారాయన్నారు. మేధావులైన విద్యావంతులు, వైద్యులు తమ గ్రామాలను దత్తత తీసుకొని సేవ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని సూచించారు. తమ సొంత గ్రామానికి వైద్య సేవలు అందించాలని సంకల్పంతో దొమ్మటి ప్రసన్న కుమార్ రాజేశ్వరి దంపతులు తమ వైద్య స్నేహితులతో కలిసి గ్రామంలో మెడికల్ క్యాంపు ఏర్పరచడం అభినందనీయమన్నారు.వారు మల్లక్కపేట గ్రామానికి మరిన్ని సేవలందించాలని ఈ సందర్భంగా సూచించారు.

అనంతరం జరిగిన మెడికల్ క్యాంపులో వైద్యులు గ్రామస్తులకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులను ఉచితంగా పంపిణీ చేశారు.ఉదయం 9గంటల నుండి సాయంత్రం 3 గంటల వరకు సాగిన ఈ వైద్య శిబిరంలో మధుమేహం,బిపి ,కంటి పరీక్షలు,గుండె పరిక్షలు నిర్వహించడం జరిగింది.అవసరమున్న వారికి గుండె పరీక్షలకు ఈసీజీ చేయడం జరిగింది.ప్రతి ఒక్కరికి అవసరం మేరకు ఉచితంగా మందులను అందించారు. ఈ శిబిరాన్ని ఐఎంఏ వరంగల్ అధ్యక్షులు డాక్టర్ కే నాగార్జున, ప్రధాన కార్యదర్శి అజిత్ మహమ్మద్, ఉపాధ్యక్షులు, డాక్టర్ వి నరేష్ కుమార్, యూరాలజిస్ట్ డాక్టర్ గీతాంజలి నరేష్, ఆర్థోపెడిషియన్ డాక్టర్ జి విజయ్ కుమార్, జనరల్ ఫిజీషియన్ డాక్టర్ సీతారామరాజు, కార్డియాలజిస్టు శ్రావణ్ కుమార్, పల్లె దావకాన మెడికల్ ఆఫీసర్ డాక్టర్ జ్యోతి, డాక్టర్ మాధవి, ఆశ వర్కర్, ఏఎన్ఎంలు, జీఎన్ఎంలు వైద్య సేవలు అందించారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిపి పాడి కల్పన ప్రతాప్ రెడ్డి, మాజీ పిఎసిఎస్ చైర్మెన్ బొజ్జం రమేష్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దేవేందర్ రెడ్డి, కాంగ్రెస్ సేవాదళ్ హనుమకొండ జిల్లా అధ్యక్షులు బొచ్చు చందర్,పరకాల సిఐ క్రాంతి కుమార్,ఎస్ఐ రమేష్,పవన్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad