నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండి మెరుగైన వైద్యం అందించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. మంగళవారం రోజు భువనగిరి మండలం అనాజీపురం గ్రామంలో పల్లె దవాఖాన ను కలెక్టర్ ను ఆకస్మిక తనిఖీ చేశారు. ఆస్పత్రి విధులకు ఎంత మంది సిబ్బంది హాజరు అయ్యారని,ఎంత మంది సిబ్బంది హాజరు కాలేదని అటెండెన్స్ రిజిస్టర్ చెక్ చేశారు.రోజు ఆసుపత్రి ఓపికి ఎంత మంది పేషెంట్లు వస్తార అని సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. గత నెలలో ఈ దవాఖాన పరిధిలో ఎన్ని ఈ డి డి లు ఉన్నాయి, అందులో ఎన్ని ప్రభుత్వ ఆసుపత్రి లో జరిగాయి, ప్రైవేటు లో ఎన్ని జరుగాయఅడిగి తెలుసుకున్నారు.ప్రైవేటు ఆసుపత్రి లో డెలివరీ అయినా బాలింత తో ఫోన్ లో మాట్లాడారు. ప్రైవేట్ ఆసుపత్రి కి ఎందుకు వెళ్ళారని, మన జిల్లా ఆసుపత్రి లో మెరుగైన వైద్యం అందిస్తున్నారని, ప్రైవేట్ కి వెళ్తే వేల డబ్బులు ఖర్చు అవుతాయ అన్నారు.
అనంతరం పంచాయతీ సెక్రటరీ తో మాట్లాడుతూ గ్రామంలో పారిశుధ్య కార్యక్రమాలు పూర్తి అయ్యాయని, నీరు నిలిచిన చోట ఆయిల్ బాల్స్ వేసరా అని, గ్రామం దోమలు ప్రభలకుండా ఫాగింగ్ చేశారా అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం అంగన్ వాడి టీచర్ తో మాట్లాడుతూ రోజు ఎంత మంది పిల్లలు అంగన్వాడీ కేంద్రానికి వస్తున్నరని , ఎంత మంది గర్భిణిలు, బాలింతలు వస్తున్నారని అడిగి తెలుసు కున్నారు. అందరికీ రోజు పాలు, గుడ్డు , భోజనం పెడుతున్నార అని అన్నారు. గ్రామంలో కొత్త గా ఓటర్లు ఎంత మంది అప్లై చేసుకున్నారు, మరణించిన వారి ఓట్లు తొలగించార అని అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో కొత్త ఓటర్ల జాబితా విడుదల చేశార అని అడిగారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.