నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య జయంతి వేడుకలను హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో శుక్రవారం నిర్వహించారు. దొడ్డి కొమరయ్య చిత్రపటానికి శాసన మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి, మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డి, బీఆర్‌ఎస్ నేతలు పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మధుసూదనాచారి మాట్లాడుతూ అమరజీవి, ధన్యజీవి దొడ్డి కొమరయ్య అని అన్నారు. తెలంగాణ తల్లి కన్న ఆణిముత్యాల్లో ఆయన ఒకరని చెప్పారు. ఆత్మగౌరవం కోసం ఉమ్మడి వరంగల్ జిల్లాలో విసునూరి రామచంద్రారెడ్డిని ఎదిరించిన గొప్ప నాయకుడు దొడ్డి కొమరయ్య అని అన్నారు. అరాచకాలను చూడలేక దొడ్డి కొమరయ్య పోరాట పటిమ మరవలేనిదని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు సుమిత్రానంద్, ఉపేంద్రచారి, దూదిమెట్ల బాలరాజు యాదవ్, తుంగబాలు, కురువ విజయ్ కుమార్, దేవరి మల్లప్ప తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ భవన్‌లో దొడ్డి కొమరయ్య జయంతి వేడుకలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



