Saturday, July 5, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్దొడ్డి కొమురయ్య 79వ వర్ధంతి 

దొడ్డి కొమురయ్య 79వ వర్ధంతి 

- Advertisement -

నవతెలంగాణ – రామారెడ్డి : తెలంగాణ సాయుధ పోరాటయోధుడు దొడ్డి కొమురయ్య కురుమ 79 వ వర్ధంతిని మండలంలోని గొల్లపల్లి, పోసానిపేట తో పాటు ఆయా గ్రామాల్లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ… భూమికోసం, భుక్తి కోసం, బడుగుల విముక్తి కోసం పోరాడి, తొలి అమరుడు రైతాంగ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య అని కొని ఆడారు. ట్యాంక్ బండ్ పై ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కురుమ యువ చైతన్య సమితి వ్యవస్థాపకులు చెలిమేటి గంగాధర్ కురుమ, పాల మల్లేష్, రెడ్డి మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -