Saturday, July 5, 2025
E-PAPER
Homeఎడిట్ పేజిదొడ్డి కొమురయ్య వ్యక్తికాదు.. సంఘటిత శక్తి

దొడ్డి కొమురయ్య వ్యక్తికాదు.. సంఘటిత శక్తి

- Advertisement -

నూనూగు మీసాల యుక్తవయసులోనే తన ఉడుకు నెత్తురుతో నేల తల్లికి రక్త తిలకం దిద్ది, పోరు శంఖం ఊదిన ధీరుడు. అణిచివేతలే తిరుగుబాటుకు పురుడు పోస్తాయనేందుకు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఒక నిదర్శనమైతే, సామాన్యులు త్యాగాలతో అసామాన్యులుగా చరిత్రలో నిలిచిపోతార నేందుకు నిలువెత్తు సాక్ష్యం దొడ్ది కొమురయ్య. నిజాం నిరంకుశ పాలన, భూస్వాముల అణచివేత, అరాచకాలు, వెట్టిచాకిరీకి వ్యతిరేకంగా రైతులు, కూలీలు, పేదలు చేసిన ఒక చారిత్రక తిరుగుబాటు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం. ఈ పోరాట తొలి అమరుడిగా చరిత్రలో నిలిచిన వ్యక్తే దొడ్డి కొమురయ్య.


ఆయన ఒక సాధారణ గొర్రెల కాపరి కుటుంబంలో జన్మించిన యువకుడు. నిజాం పాలనలో భూస్వాములు, దొరలు రైతులను, కూలీలను దోపిడీ చేస్తూ, వెట్టిచాకిరీ, అన్యాయమైన పన్నులతో అణిచివేస్తున్న క్రమంలో ఆంధ్ర మహాసభ ఆధ్వర్యంలో రైతులు, కమ్యూనిస్టు నాయకులు ఈ అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడారు. కొమురయ్య అన్న దొడ్డి మల్లయ్య కమ్యూనిస్టు పార్టీ కడవెండి గ్రామ నాయకుడు. ఆయన ప్రభావంతో ఉద్యమంలో చేరాడు. జనగామ జిల్లా కడవెండి గ్రామంలో విసునూరు రామచంద్రారెడ్డి తల్లి జానకమ్మ దొరసాని లేవీ కోసం రైతులను, వెట్టిచాకిరి కోసం వృత్తిదారులను పెట్టే చిత్ర హింసలను తట్టుకోలేక సమ్మెకు దిగారు. తమ సమస్యలపై 1946 జులై 4న శాంతియుతంగా నిరసన ప్రదర్శన చేపట్టారు. అప్పుడే గొర్రెలకాడినుండి తినడానికి ఇంటికి వచ్చిన దొడ్డి కొమురయ్యకు నిరసన ప్రదర్శన విషయం తెలియగానే గొడ్డలి భుజాన పెట్టుకొని ఉత్సాహంతో పరిగెత్తి ప్రదర్శన ముందు వరుసలో చేరా డు. సమ్మె డిమాండ్ల నినాదాలతో కదులుతున్న ర్యాలీ జానకమ్మ దొరసాని గడి ముందుకు రాగానే విసునూరు దేశ్‌ముఖ్‌ రామచంద్రారెడ్డి గూండాలు గడి గోడలపై నుండి కాల్పులు జరిపారు.

గూండాల తుపాకీ గుళ్లకు ఎదురొడ్డి దొడ్డి కొమురయ్య నేలకొరిగాడు. ఆయన బలిదానం ప్రజల్లో ఆగ్రహ జ్వాలలను రగిల్చింది. రైౖతాంగ సాయుధ పోరాటానికి నాంది పలికింది. ఉద్యమం మరింత ఉధృతమైంది.ఆనాటి రైతాంగాన్ని ఉత్తేజపరిచినట్లే, నేటికి సామాజిక, ఆర్థిక, రాజకీయ సమస్యలపై పోరాడేందుకు స్పూర్తినిస్తూనే ఉంది.
కొమురయ్య లాంటి సామాన్య వ్యక్తులు అన్యాయాన్ని ఎదిరించిన తీరు, ఈ రోజు రైతులకు, కార్మికులకు స్ఫూర్తినిస్తుంది. వ్యవసాయ సంక్షోభం, పంటలకు గిట్టుబాటు ధర లేకపోవడం, బలవంతపు భూ సేకరణ వంటి సమస్యలు రైతుల ఆత్మహత్యలకు కారణమవుతున్నాయి. ఉపాధి లేమి వ్యవసాయ కూలీల జీవితాలను చిన్నాభిన్నం చేసింది. ఈ సమస్యలను ఎదుర్కొనేందుకు పోరాటాలు జరుగుతున్నాయి. మూడు వ్యవసాయ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఉద్యమం ఇటువంటి అన్యాయాలకు వ్యతిరేకంగా జరిగిన సమరమే. ఆయన త్యాగం, ధైర్యం ప్రజలు ఐక్యంగా నిలబడి పోరాడితే ఎటువంటి అణచివేతనైనా ఎదుర్కొనవచ్చని నిరూపిస్తుంది. కొమురయ్య పోరాటం కేవలం భూమి కోసం మాత్రమే కాదు, సామాజిక సమానత్వం, వెట్టిచాకిరీ నిర్మూలన కోసం కూడా. కుల, వర్ణ వివక్షలు, సామాజిక అసమాన తలు నేటికీ సమాజంలో కొనసాగుతున్నాయి. మతోన్మా దం పడగవిప్పి బుసలు కొడుతోంది. దళితులు, ఆదివా సీలు, మైనార్టీలు, మహిళలు, ఇతర అణగారిన తరగతు లపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటాలు, హక్కుల కోసం జరుగుతున్న ఉద్యమాలు కొమురయ్య స్ఫూర్తిని ప్రతిబింబిస్తాయి. ఆయన త్యాగం, సమానత్వం కోసం పోరాడే ప్రతి వ్యక్తికి బలాన్నిస్తుంది.


కొమురయ్య మరణం వేలాది మంది గ్రామస్తులనే కాదు, నిజాం సంస్థానంలోని ప్రజలను ఒక్కతాటిపైకి తెచ్చి సాయుధ పోరాటానికి సిద్ధం చేసింది. ఈ సామూహిక ఐక్యత ఆనాటి పోరాటానికి కీలకం. ఈ రోజు కూడా, సామాజిక, ఆర్థిక, రాజకీయ సమస్యలను ఎదుర్కొనేందుకు ప్రజల ఐక్యత అవసరం. కానీ కులం, మతం, ప్రాంతం వంటి వివిధ అస్తిత్వాల పేరుతో పాలక వర్గాలు ప్రజలను చీలుస్తున్నారు. దొడ్డి కొము రయ్యను ఒక కులానికి పరిమితం చేసి, ఆయన త్యాగాన్ని వక్రీకరించే కుట్రలు జరుగుతున్నాయి. కుల, మతాలకతీతంగా కొమురయ్య త్యాగం ప్రజలందరినీ ఐక్యం చేసే పోరుబాటలో నిలిపింది. మనకు ఐక్యత ప్రాముఖ్యతను గుర్తుచేస్తుంది.ఆయన జీవితం నేటి యువతకు స్ఫూర్తిదాయకం. ఎందుకంటే కొము రయ్య కేవలం 19 ఏళ్ల వయసులోనే తన ప్రాణాలను అర్పిం చాడు. ఈ రోజున్న యువత సామాజిక మార్పు కోసం, అన్యా యాలకు వ్యతిరేకంగా గొంతెత్తాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తోంది. పాలక వర్గాలు యువతను డ్రగ్స్‌, మద్యం, అశ్లీలత వంటి పెడ మార్గం వైపు మళ్లిస్తున్నా రు, నిర్వీర్యం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొము రయ్య ధైర్యం, యువతకు తమ శక్తిని, బాధ్యతను గుర్తు చేస్తుం ది, దారి చూపుతుంది. ఆయన త్యాగం, ఒక చారిత్రక సంఘటనగా మాత్రమే కాక, సమానత్వం కోసం పోరాడే ప్రతి వ్యక్తికి నిత్య చైతన్యంగా నిలుస్తుంది.
(జులై 04 దొడ్డి కొమురయ్య వర్థంతి)
ఎండి అబ్బాస్‌
9490098032

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -