Thursday, October 9, 2025
E-PAPER
HomeNewsఘనంగా దొడ్డి కొమురయ్య వర్థంతి వేడుకలు

ఘనంగా దొడ్డి కొమురయ్య వర్థంతి వేడుకలు

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు : మండలంలో కొయ్యుర్ గ్రామంలో జాతీయ బీసీ సంఘం భూపాలపల్లి జిల్లా ఇంచార్జి విజయగిరి సమ్మయ్య ఆధ్వర్యంలో శుక్రవారం తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, తెలంగాణ తొలి ఆమరవిరుడు దొడ్డి కొమురయ్య 79వ వర్థంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం ఆయన చిత్ర పటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. దొడ్డి కొమురయ్య తెలంగాణ రైతన్న సాయుధ పోరాట యోధుడు తెలంగాణ గురించి అన్ని వర్గాల ప్రజల గురించి పోరాడిన గొప్ప ఉద్యమ కారుడు, తొలి అమరవీరుడని కొనియాడారు. ఆయన ఆశయాలను కొనసాగించాలని దొడ్డి కొమురయ్య(కురుమ)సినిమా నిర్మాత డైరెక్టర్ సేనాపతి ఆధ్వర్యంలో దొడ్డు కొమురయ్య పోరాటం  గురించి అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని త్వరలో తెలంగాణలో సినిమా ప్రారంభం చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయా కుల సంఘాల నాయకులు తాజుద్దీన్,బోయిని రాజయ్య,పావిరాల ఓదెలు,లక్ష్మణ్,అడ్డురి తిరుపతి,గడ్డం ప్రేమ్ కుమార్, వేల్పుల పోచయ్య,శంకర్, నరేష్, రాజయ్య, రాజిరెడ్డి పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -