Tuesday, October 21, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బీసీ బందుకు సహకరించమంటే టీచర్ పై అక్రమ కేసులా..? 

బీసీ బందుకు సహకరించమంటే టీచర్ పై అక్రమ కేసులా..? 

- Advertisement -

బంద్ ను వ్యతిరేకించిన రాక్ వుడ్ స్కూల్ యాజమాన్యం
ప్రెస్ మీట్లో డివైఎఫ్ఐ, కెవిపిఎస్, టిపిటిఎల్ఎఫ్ 
నవతెలంగాణ – వనపర్తి 

బీసీ బంద్ కు సహకరించాలని కోరిన ఓ ప్రైవేట్ టీచర్ పై రాక్ వుడ్ స్కూల్ యాజమాన్య కేసు నమోదు చేయించడం ఏమిటని, ఇది దుర్మార్గమైన చర్య అని డెమోక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ( డివైఎఫ్ఐ) వనపర్తి జిల్లా కార్యదర్శి మహేష్, టి పి టి ఎల్ ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు అయిత విజయ్ లు ఖండించారు. ఈ మేరకు మంగళవారం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో డివైఎఫ్ఐ, కెవిపిఎస్, టి పి టి ఎల్ ఎఫ్ నాయకులు మాట్లాడారు. అక్టోబర్ 18న రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘాలు ఇచ్చిన పిలుపులో భాగంగా వనపర్తి పట్టణంలోని రాక్ వుడ్ స్కూల్ కు వెళ్లి టీచర్లకు కూడా సెలవు ఇవ్వాలని కోరగా, అందుకు యాజమాన్యం నిరాకరించిందని, అది బీసీ రిజర్వేషన్స్ కు వ్యతిరేకంగా పాఠశాల యాజమాన్యం అహంభావ చర్యగా పేర్కొన్నారు.

పైగా సెలవు ఇవ్వమంటే ఇచ్చేశామని, పాఠశాల ప్రిన్సిపాల్ అబద్ధం చెప్పారన్నారు. అంతేకాక టీచర్లను గదులలో తాళాలు వేసి బంధించారని ఆరోపించారు. ఇదేమీ అన్యాయమని ప్రశ్నించినందుకు పైగా అబద్ధాలు చెప్పడం ఏమిటని, టీచర్స్ యువజన సంఘాల నేతలు అడుగగా ఒక టీచర్ మీద కావాలని కేసు పెట్టడం దుర్మార్గమని ఆయన అన్నారు. ఇది బీసీలకు వ్యతిరేక చర్య అని, దీన్ని అందరూ ఖండించాలని ఆయన కోరారు. బి సి రిజర్వేషన్స్ ను వ్యతిరేకిస్తూ ప్రిన్సిపాల్ మాట్లాడమే కాకుండా వచ్చిన వారిని బెదిరించే పని చేశారన్నారు. ముఖ్యంగా తెలిసిన టీచర్, గతంలో అందులో పని చేసిన ఒక టీచర్ సామాజిక వర్గం తెలిసినందున, ఆయనను నానా దుర్భాషలాడుతూ నిందించారన్నారు. “తక్కువ జాతి వాళ్ళు కూడా వచ్చి మా పాఠశాలను బంద్ పెడతారా? మీరెంత మీ బతుకైంత” అని బెదిరించడం అన్యాయమని ఆవేదన వ్యక్తం అన్నారు. ఇది దళితులను అవమానించడ మేనని ఆయన తెలిపారు.

బంద్ కు సహకరించమని అడిగినందుకు టీచర్లపై కేసు పెట్టిన ఘనత ఒక్క రాక్ వుడ్ స్కూల్ యాజమాన్య మొండి వైఖరికి, డబ్బు మదానికి, బీసీ రిజర్వేషన్స్ పట్ల వ్యతిరేకతకు నిదర్శనం అన్నారు. వెంటనే టీచర్ పై కేసు ను ఉపసంహరించుకుని యాజమాన్యం తప్పు సరిదిద్దుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే అక్కడి టీచర్లను లోపల బంధించినందుకు వారిపై కేసు నమోదు చేయాలని ఆయన పోలీసులను డిమాండ్ చేశారు. పోలీసులు టీచరని కూడా చూడకుండా, కనీసం బాధితుడిని వివరణ అడగకుండా , యాజమాన్యం చెప్పింది విని పాఠశాలకు ఎలాంటి నష్టం జరగకున్నా ఏకపక్షంగా కేసు ను నమోదు చేయడం పోలీసుల పక్షపాత ధోరణి కి నిదర్శనంగా భావించాల్సి వస్తుందని ఆయన అన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -