గ్రామ అభివృద్ధి పట్ల పాలకుల నిర్లక్ష్య వైఖరి సరైనది కాదు
డివైఎఫ్ఐ మాజీ రాష్ట్ర కార్యదర్శి ఐత విజయ్
నవతెలంగాణ – మునుగోడు
మండలంలోని కల్వకుంట్ల గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని, ప్రాథమిక పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణం చేపట్టాలని, డివైఎఫ్ఐ,ప్రజా సంఘాల ఆధ్వర్యంలో శనివారం ఆ గ్రామంలో ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ మాజీ రాష్ట్ర కార్యదర్శి ఐత విజయ్ మాట్లాడుతూ 77 ఏండ్ల స్వతంత్ర భారతంలో గ్రామాలకు బస్సు సౌకర్యం, సరైనటువంటి రవాణా సౌకర్యం లేకపోవడం చాలా సిగ్గుచేటు అన్నారు. గ్రామానికి బస్సు సౌకర్యం కావాలని అనేక సార్లు, అనేక దపాలుగా అధికారులకు విన్నవించిన, ధర్నాలు మరియు రాస్తారోకోలు చేసిన ఏమాత్రం కూడా పాలకులు, అధికారులు స్పందించకుండా నిమ్మకు నీరెత్తినట్టుగా, ఈ గ్రామం పట్ల ప్రజా ప్రతినిధులు చవితి తల్లి ప్రేమను ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు.
అనేకమంది విద్యార్థులు పై చదువుల కొరకు నిత్యము ప్రతి రోజు 50 నుంచి 100 మంది విద్యార్థులు ప్రయాణం చేస్తుంటే స్థానిక నాయకులకు కొంచెం కూడా చీమకుంటిదంతా బాధ కూడా వారికి లేదని అన్నారు. ఎవరు ఎటు పోతే మాకు ఏమి అన్నట్టుగా మా ప్రయోజనాలే మాకు ముఖ్యం అన్నట్టుగా వ్యవహరించడం సరైన పద్ధతి కాదని ప్రాథమిక పాఠశాలను నిర్మించి సుమారు 30 సంవత్సరాల అవుతున్నప్పటికీ ఇప్పటికీ కూడా ప్రహరీ గోడ లేకపోవడం పేద విద్యార్థుల పట్ల ఈ పాలకులు, ప్రభుత్వాల కుట్రేనని కనీసము విద్యార్థులు చదువుకోవడానికి, కూర్చోవడానికి బెంచీలు సైతం లేకపోవడం చాలా సిగ్గుచేటు అన్నారు.కల్వకుంట నుండి వెలమకన్నె గ్రామానికి మంజూరైన రోడ్డును ప్రారంభించి మధ్యలోనే అసంపూర్తిగా వదిలేశారని దాన్ని తక్షణమే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.
గతంలో స్థానిక ఎమ్మెల్యే గారు ఈ గ్రామాన్ని దత్తత తీసుకుంటానని చెప్పి అప్పుడు మా పార్టీ అధికారంలో లేదని అందుకే నేను అభివృద్ధి చేయలేకపోయాను అని మాయమాటలు చెప్పి మళ్ళీ ఎలక్షన్లో గెలిచిన తర్వాత గ్రామం వైపు కన్నెత్తి చూడకపోవడం సిగ్గుచేటు అన్నారు. స్థానికంగా ఉండే నాయకులు తమకు తమ వ్యక్తిగత ప్రయోజనాల మీద మరియు తమ పదవుల మీద ఉన్నటువంటి సోయి గ్రామ అభివృద్ధి మీద లేకపోవడం చాలా విడ్డూరం అన్నారు. ఇప్పటికైనా పాలకులు అధికారులు స్పందించాలని, గ్రామ అభివృద్ధికి సహకరించాలని కోరారు. లేనిపక్షంలో గ్రామ అభివృద్ధి కోసం మరిన్ని పోరాటాలకు యువత నడుంబిస్తుందని అన్ని విధాలుగా గ్రామాన్ని అభివృద్ధి దూరం చేస్తున్న నాయకులను స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాల్సిన పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి కట్ట లింగస్వామి,సిఐటియు మండల కన్వీనర్ వరికుప్పల ముత్యాలు, ప్రజాసంఘాల నాయకులు పగిళ్ల మధు, కుక్కల బాలస్వామి, పగిళ్ళ యాదయ్య, డివైఎఫ్ఐ నాయకులు కట్ట ఆంజనేయులు,బొందు శివ,కుక్కల మహేష్, చేకూరి ప్రేమ్ సాగర్ తదితరులు పాల్గొన్నారు.
కల్వకుంట్ల గ్రామానికి ఉచిత బస్సు అవసరము లేదా!..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES