ముఖంపై తీవ్రగాయాలు
మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు ..
నకిరేకల్ పట్టణ కేంద్రంలో ఘటన
నవతెలంగాణ- నకిరేకల్
నల్లగొండ జిల్లా నకిరేకల్ పట్టణంలో శుక్రవారం ఐదేండ్ల బాలుడిపై కుక్క దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. వివరాల్లోకి వెళితే.. 12వ వార్డు శివాజీనగర్‌కు చెందిన శంకర్ కుమారుడు శరత్ చంద్రకాంత్ ఇంటి ముందు ఆడుకుంటుండగా కుక్క అకస్మాత్తుగా దాడి చేసింది. ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి. బాలుడి అరుపులు విన్న స్థానికులు వెంటనే స్పందించి కుక్కను తరిమికొట్టారు. స్థానిక ప్రయివేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని నీలోఫర్ ఆస్పత్రికి తరలించారు.
వీధి కుక్కలు కోతుల బెడద పై ప్రజల్లో ఆందోళన
నకిరేకల్ పట్టణంలో వీధి కుక్కలు, కోతుల బెడద రోజురోజుకూ పెరుగుతోందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కుక్కలు చిన్న పిల్లల వెంట పడుతున్నాయని, కోతులు గుంపులుగా తిరుగుతూ ఇండ్లపైకి ఎగబడి దాడులకు దిగుతున్నాయని ప్రజలు వాపోతున్నారు.
ప్రత్యేక చర్యలు మున్సిపల్ కమిషనర్ రంజిత్‌కుమార్
పురపాలక సంఘం సర్వసభ్య సమావేశంలో వీధి కుక్కలు, కోతుల సమస్యపై చర్చించాం. వీధి కుక్కల నియంత్రణ, కోతుల బెడద నివారణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నాం. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
బాలుడిపై కుక్క దాడి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



