గొర్రెల పంపిణీ వెంటనే ప్రారంభించాలి…
జిఎంపిఎస్ జిల్లా అధ్యక్షులు దయ్యాల నరసింహ…
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
జిల్లావ్యాప్తంగా కుక్కల దాడులలో అనేక గొర్రెలు చనిపోతున్నాయని, కుక్కల బెడదకు పశుసంవర్ధక శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వం స్పందించి వెంటనే సబ్సిడీతో గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించాలని జిఎంపిఎస్ జిల్లా అధ్యక్షులు దయ్యాల నరసింహ కోరారు. శనివారం మండలంలోని బస్వాపురం గ్రామంలో సొసైటీ సభ్యులతో కలిసి పోస్టర్ ఆవిష్కరించి, మాట్లాడారు. నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ పథకంలో గొర్రెల మేకల పెంపకందారుల కుటుంబలలో చదువుకున్న యువతకు ఈ పథకం వర్తించేలా నిబంధనలు సవరించాలని కోరారు. జిల్లా పశుసంవర్ధక శాఖలో 41 పోస్టులు ఖాళీగా ఉన్నాయని వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిఎంపిఎస్ మండల కార్యదర్శి పాక జహంగీర్, జిల్లా కమిటీ సభ్యులు మధ్య పురం బాల్ నరసింహ, సొసైటీ అధ్యక్షులు రాసాల బాల మల్లయ్య, సొసైటీ సభ్యులు వరే లక్ష్మి నరసింహ, రాసాల నరేష్, బొడ్డు ఐలయ్య, రాసాల రాజమల్లయ్య, రాసాల భాగ్యరాజు, వనగంటి బాల నరసింహ, రాసాల దయాకర్, వేములయ్య, నోముల వెంకటరమణ, బిక్షపతి, సొసైటీ సభ్యులు పాల్గొన్నారు.
కుక్కల బెడద నివారించాలి…
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES