నవతెలంగాణ – కంఠేశ్వర్ : నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశాల మేరకు ఒకటవ పోలీస్ స్టేషన్ పరిధిలోని బస్టాండ్, రైల్వే స్టేషన్, ప్రభుత్వ ఆస్పత్రి ప్రాంతాలలో డాగ్స్ స్క్వాడ్ తనిఖీలు గురువారం రాత్రి నిర్వహించడం జరిగిందని ఒకటవ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ రఘుపతి శుక్రవారం తెలిపారు. తమ పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు ప్రాంతాలలో అనుమానాస్పదంగా తిరుగుతున్నటువంటి వ్యక్తుల బ్యాగులను చెక్ చేయడం జరిగిందన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు నగరంలో చోటు చేసుకోకూడని తనిఖీలు చేపట్టినట్లు తెలిసింది. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపించినట్లయితే సంబంధిత పోలీస్ అధికారులకు సమాచారం ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. అత్యవసర పరిస్థితులలో డయల్ 100ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
నగరంలోని రద్దీ ప్రదేశాల్లో డాగ్స్ స్క్వాడ్..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES