వారెన్ బఫెట్ వెల్లడి
వాషింగ్టన్ : అమెరికా డాలర్ పతనావస్థలో ఉందని ప్రముఖ బిలియనీర్, బెర్క్‌షైర్ హాత్వే సిఇఒ వారెన్ బఫెట్ అన్నారు. శనివారం జరిగిన బెర్క్‌షైర్ హాత్వే 60 వార్షిక వాటాదారుల సమావేశంలో బఫెట్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. డాలర్ డీలా పడుతోందన్నారు. ”ఒక దేశంగా మనకు ఎప్పుడూ చాలా సమస్యలు ఉంటాయి. కానీ ఇది మాత్రం మనమే తెచ్చుకున్న సమస్య. అమెరికా ఆర్ధిక విధానాలు, వాణిజ్య విధానం వంటివన్నీ డాలర్ మీద ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి.” అని బఫెట్ పేర్కొన్నారు. పెట్టుబడిదారులు కేవలం యూఎస్ డాలర్ మీద మాత్రమే కాకుండా, ఇతర కరెన్సీలలో కూడా పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నారన్నారు. అమెరికాలో ఆర్థిక లోటు సమస్య ఎప్పటి నుంచో పరిష్కారం కాకుండా ఉందన్నారు. ఈ పరిస్థితి ఇంకా ఎన్ని సంవత్సరాలు కొనసాగుతుందో అంచనా వేయలేకపోతున్నామని చెప్పారు. అమెరికా చాలా కాలంగా భరించలేని ఆర్థిక లోటుతో పని చేస్తోందన్నారు. ఇది ప్రస్తుతం నియంత్రించలేని స్థాయికి చేరిందన్నారు.
సీఈఓ పదవీకి రాజీనామా..
వారెన్ బఫెట్ త్వరలోనే తన సీఈఓ పదవీని వీడనున్నారు. తన పదవీ విరమణ ప్రణాళికలను ప్రకటిస్తూ.. 2025 చివరి నాటికి ఆ పదవి నుంచి వైదొలుగుతానని వాటాదారుల సమావేశంలో వెల్లడించారు. తన రెండో కుమారుడు హువర్డ్ బఫెట్ కంపెనీ చైర్మెన్‌గా బాధ్యతలు చేపడతారని చెప్పారు. గ్రెగ్ అబెల్ కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తారని వెల్లడించారు. తన పదవీ విరమణ, గ్రెగ్‌ను సీఈఓగా నియమించాలనే నిర్ణయాలు తన కుటుంబసభ్యులకు తప్పా గ్రెగ్‌కు కూడా తెలియదన్నారు.
పతనావస్థలో డాలర్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES