Saturday, March 14, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంరక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవండి

రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవండి

- Advertisement -

చిక్కడపల్లి ఏసీపీ రమేష్‌ కుమార్‌
ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో
భగత్‌ సింగ్‌ స్మారక యువజన ఉత్సవాలు
నవతెలంగాణ – ముషీరాబాద్‌

రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలని చిక్కడపల్లి ఏసీపీ రమేష్‌ కుమార్‌, చిక్కడపల్లి ట్రాఫిక్‌ సీఐ ఏడుకొండలు పిలుపునిచ్చారు. ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ హైదరాబాద్‌ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో నిర్వహి స్తున్న భగత్‌ సింగ్‌ స్మారక యువజన ఉత్సవాల సందర్భం గా శుక్రవారం బాగ్‌లింగం పల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరాన్ని కాచిగూడ సీఐ రాజశేఖర్‌తో కలిసి వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ.. రక్తదానం చేయడంలో యువకులు, విద్యార్థులు ముందుం డాలన్నారు. యువత సేవా కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొనాలని పిలుపు నిచ్చారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమలను అభినందిం చారు. సమాజంలో జరుగు తున్న అన్యాయాలు, అవినీతి, నిరుద్యోగం, విద్యా వ్యాపారీకరణ, మాదకద్రవ్యాల వ్యాప్తి వంటి సమస్యలపై యువత ప్రశ్నించే తత్వాన్ని అలవర్చు కోవాలన్నారు. ప్రశ్నించే యువతే సమాజ మార్పునకు మార్గం చూపుతుందని తెలిపారు. కాచిగూడ సీఐ మాట్లాడుతూ.. దేశంలో పెరుగు తున్న నిరుద్యోగం, విద్యార్థులపై పెరుగు తున్న భారాలు, యువతను మాదకద్రవ్యాల బారినపడేలా చేస్తున్న శక్తులను ఎదిరిం చడం ప్రతి చైతన్యవం తమైన విద్యార్థి, యువకుని బాధ్యత అని అన్నారు. చిక్కడపల్లి ట్రాఫిక్‌ సీఐ మాట్లాడుతూ.. నేటి యువత వినోద, చెడు వ్యసనాలకు అలవాటు పడి వారి జీవితాలను ఆగం చేసుకుం టున్నారన్నారు. అలాంటి వాటికి దూరంగా ఉండి భగత్‌ సింగ్‌ స్ఫూర్తితో మంచి భవిష్యత్తు కోసం దారి చూపే ఇలాంటి సంఘాల్లో పని చేయాలని సూచించారు. డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కోట రమేష్‌, వెంకటేష్‌ మాట్లా డుతూ.. ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ సంయుక్తంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా, మండల కేంద్రాల్లో భగత్‌ సింగ్‌ యువజన ఉత్సవాలు నిర్వహిస్తు న్నామని తెలిపారు. ఈ ఉత్సవాలను విద్యార్థులు, యువత విజయవంతం చేయాలని పిలుపుని చ్చారు. ఈ కార్యక్రమంలో ఐపీఎం బ్లడ్‌ బ్యాంక్‌ ఇన్‌చార్జి మాధవి, ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు అశోక్‌ రెడ్డి, లెనిన్‌, జావెద్‌, రాజయ్య, రజనీకాంత్‌, ప్రవీణ్‌, అర్జున్‌, ఆశ్వక్‌, మనోజ్‌, మదన్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -