సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు సుదర్శన్ సుదర్..
నవతెలంగాణ – డిచ్ పల్లి
ఇందల్ వాయి మండలంలోని నల్లవెల్లి గ్రామంలో నిర్మించ తలపెట్టిన శ్రీ శ్రీ శ్రీ శివగంగ కేదార్నాథ్ విశ్వేశ్వర ఆలయం కేదార్నాథ్ ఆలయం నిర్మాణానికి తమ వంతుగా ఇందల్ వాయి మండలంలోని ఇందల్ వాయి తండా సర్పంచ్, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు సుదర్శన్ నాయక్ (సుదర్),తండా నాయక్ గన్య నాయక్, కార్బరీ సామ్య నాయక్, ఉప సర్పంచ్ బాల్ చందర్, మాజీ సర్పంచ్ చందర్ నాయక్, తండా పెద్దమనుషులు సోమవారం ఆలయ బాధ్యులు సంతోష్ మహారాజ్ కు రూ.26వేల ర్థిక సహాయాన్ని అందజేశారు. విరాళాలు అందించిన భక్తులకు ఆ మహా శివయ్య ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉంటుందని కోరుకుంటున్నాట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ డైరెక్టర్ చందర్ నాయక్, బాల్ రాం, గోపాల్, రమేష్, రవి, నరేష్, వసంత్ రావు తోపాటు తదితరులు పాల్గొన్నారు.
ఆలయ నిర్మాణానికి విరాళం అందజేత..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



