నవతెలంగాణ-ఆత్మకూరు
రక్తదానం మరొకరికి ప్రాణదానం అవుతుందని ఆత్మకూరు తహశీల్దార్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. సోమవారం హనుమకొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో లయన్స్ క్లబ్ హనుమకొండ చేపట్టిన రక్తదాన శిబిరంలో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఆత్మకూరు మండల తాసిల్దార్ జగన్మోహన్ రెడ్డి, ఈ సందర్భంగా తాసిల్దార్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. రక్తదానం అతి పవిత్ర సేవ అని, అందరూ దీనికి సహకరించాలని పిలుపునిచ్చారు.
లయన్స్ క్లబ్ నాయకులు ఈ కార్యక్రమానికి స్పందించిన అధికారులకు, సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది, గ్రామ పంచాయతీ అధికారుల అసోసియేషన్ జిల్లా జే. మోహన్, ఆత్మకూరు మండల అధ్యక్షులు పి. రాజు ఏ. మదు, జనరల్ సెక్రటరీ వి. సంపూర్ణ, చీఫ్ జూనియర్ అసిస్టెంట్ ఇ. శ్రీకాంత్ తదితరులు పాల్గొని రక్తదానం చేశారు.



