వర్ధన్నపేట ఏసిపి నర్సయ్య
నవతెలంగాణ – పాలకుర్తి
రక్తదానం ప్రాణదానంతో సమానమని వర్ధన్నపేట ఏసిపి అంబటి నర్సయ్య తెలిపారు. పోలీస్ అమరుల వారోత్సవాల్లో భాగంగా బుధవారం మండల కేంద్రంలో గల బషారత్ గార్డెన్లో వర్ధన్నపేట పోలీస్ డివిజన్ ఆధ్వర్యంలో వరంగల్ సిపి సన్ ప్రీత్ సింగ్, జనగామ డిసిపి రాజమహేంద్ర నాయక్ ఆదేశాల మేరకు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నర్సయ్య మాట్లాడుతూ.. రక్తదానం చేయడం ఇతరుల ప్రాణానికి ఎంతో ఉపయోగపడుతుందని యువతకు సూచించారు. రక్తదాన కార్యక్రమానికి యువత శ్రద్ధ చూపడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో పాలకుర్తి సీఐ వంగాల జానకిరామ్ రెడ్డి, వర్ధన్నపేట సీఐ శ్రీనివాసరావు, ఎస్సైలు దూలం పవన్ కుమార్, మేకల లింగారెడ్డి, ఎండి యాకూబ్ హుస్సేన్, యు సృజన్ కుమార్, చింతా రాజు, సాయిబాబా, రామారావు, రాజేందర్ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
రక్తదానం ప్రాణదానంతో సమానం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



