Saturday, October 4, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గవర్నమెంట్ స్కూల్ చిన్నారులకు డ్రెస్సులు అందజేత

గవర్నమెంట్ స్కూల్ చిన్నారులకు డ్రెస్సులు అందజేత

- Advertisement -

నవతెలంగాణ – జక్రాన్ పల్లి 
నిజామాబాద్ జిల్లా జక్రాన్ పల్లి మండలం చింతలూరులోని గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్  చిన్నారులకు ఉచితంగా యూనిఫాం డ్రెస్సులు అందజేశారు. దాత గోపిడి రవీందర్ రెడ్డి. ప్రైమరీ స్కూల్ లోని ఒకటి నుంచి ఐదో తరగతి విద్యార్థులకు రూ.40 వేల విలువైన డ్రెస్సులు ఇచ్చారు. చిన్నారులు క్రమశిక్షణతో చదువు  నేర్చుకుని…భవిష్యత్ లో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని దాత గోపిడీ రవీందర్ రెడ్డి ఆకాంక్షించారు. శ్రద్ధగా చదివి, గ్రామానికి, తల్లిదండ్రులకు పేరు తేవాలన్నారు. గ్రామంలో విద్యాభివృద్ధికి మరిన్నిసేవాకార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో రవీందర్ రెడ్డి ని ప్రైమరీ స్కూల్ టీచర్లు, గ్రామపెద్దలు అభినందించారు. చింతలూరుకు చెందిన గోపిడి రవీందర్ రెడ్డి హైదరాబాద్ లో సాప్ట్ వేర్ ఇంజనీర్ గా ఇరువై ఎళ్లుగా పనిచేస్తున్నారు. ఇంజనీరింగ్ విద్యార్థులకు సాప్ట్ వేర్ స్కిల్స్ కోసం ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇస్తున్నారు.

నేషనల్ బాస్కెట్ బాల్ ఆటగాళ్లకు అభినందన

కార్యక్రమంలో బాస్కెట్ బాల్, హ్యాండ్ బాల్ లో తెలంగాణ టీమ్ నుంచి జాతీయస్థాయిలో ప్రాతినిధ్యం వహించిన గోపిడి రవీందర్ రెడ్డి కూతుళ్లు  స్నిగ్ధ రెడ్డి ,సాన్వి రెడ్డి లను చింతలూరు గ్రామస్థులు ప్రత్యేకంగా శాలువలతో సన్మానించారు. జాతీయస్థాయిలో ఆటతో చింతలూరుకు పేరురావటం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో విలేజ్ డెవలప్ మెంట్ కమిటీసభ్యులు, సొసైటీ చైర్మన్ నాగుల శ్రీనివాస్ గారు, జలంధర్, పంచాయతీ సెక్రటరీ రాకేష్, హైస్కూల్ టీచర్లు లచ్చన్న, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాములు, శ్రీనివాస్ రెడ్డి, సంధ్యారాణి పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -