Saturday, February 7, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రాష్ట్ర స్థాయి వాలీబాల్ ఛాంపియన్ షిప్ నిర్వహణ కోసం విరాళం

రాష్ట్ర స్థాయి వాలీబాల్ ఛాంపియన్ షిప్ నిర్వహణ కోసం విరాళం

- Advertisement -

– రూ. లక్ష విరాళంగా అందజేసిన ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి
నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
మండల కేంద్రంలోని గ్రీన్ ఫీల్డ్ మినీ స్టేడియంలో  జరుగుతున్న రాష్ట్ర స్థాయి అండర్-16 వాలీబాల్ పోటీలకు రాష్ట్ర మాజీ మంత్రి, బాల్కొండ నియోజక వర్గ శాసనసభ్యులు వేముల ప్రశాంత్ రెడ్డి రూ.లక్ష విరాళంగా అందజేశారు. ఈ మేరకు శనివారం స్థానిక బీఆర్ఎస్ నాయకులతో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పంపించిన రూ.లక్ష విరాళం మొత్తాన్ని గ్రీన్ ఫీల్డ్ స్టేడియం వద్ద మండల వాలీబాల్ అసోసియేషన్ సభ్యులకు సర్పంచ్ కొత్తపల్లి హారిక అశోక్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ కొత్తపల్లి హారిక అశోక్ మాట్లాడుతూ కొద్ది రోజుల క్రితం జరిగిన గ్రీన్ ఫీల్డ్ మినీ స్టేడియంలో జరిగిన రాష్ట్ర స్థాయి సాఫ్ట్ బాల్ పోటీల ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మండల కేంద్రంలో రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడలను నిర్వహిస్తే తన వంతుగా సహకారం అందిస్తానన్న హామీని ఇచ్చారన్నారు.

ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి తాను ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలకు ఆర్థిక సహకారం అందించి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నట్లు తెలిపారు. రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు ఆర్థిక సహకారం అందించిన ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డికి ఈ సందర్భంగా కమ్మర్ పల్లి వాలీబాల్ అసోసియేషన్ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కొత్తపల్లి అశోక్, మాజీ ఎంపీటీసీ సభ్యుడు మైలారం సుధాకర్, బిఆర్ఎస్ పార్టీ మండల ఉపాధ్యక్షుడు మల్యాల సుభాష్ గౌడ్, వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షులు అజారుద్దీన్, కమ్మర్ పల్లి సీనియర్ వాలీబాల్ క్రీడాకారుడు నూతికట్టు విక్రం, సుంకరి బాలు, క్రీడాకారులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -