Tuesday, February 17, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సేవాలాల్ మందిర్ నిర్మాణానికి విరాళం అందజేత

సేవాలాల్ మందిర్ నిర్మాణానికి విరాళం అందజేత

- Advertisement -

నవతెలంగాణ – రెంజల్
రెంజల్ మండలం సాటాపూర్ గిరిజన తండాలో సేవాలాల్ మందిర నిర్మాణానికి గ్రంధాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి తాండవాసులకు రూ.1,50,000 ఇవ్వడానికి ముందుకు వచ్చారు. ఇటీవల సర్పంచ్ ఎన్నికలను పురస్కరించుకొని లచ్చే వార్ సుహాసిని గెలుపు కోసం ఆయన వారికి లక్ష రూపాయలు ఇస్తానని హామీ ఇవ్వగా వాటిని ఈరోజు ఇవ్వడానికి వచ్చారు. మంది నిర్మాణా నికి మరో రూ.50000 అదనంగా ఇవ్వాలని కోరగా.. ఆయన రూ. 1 లక్ష 50 వేలు అందజేస్తానని వారికి హామీ ఇవ్వడం కాకుండా పనులు ప్రారంభించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి నాగభూషణం రెడ్డి, ఓబిసి మండల అధ్యక్షులు లచ్చే వార్ నితిన్, కంఠం గంగారం, తాండ పెద్దలు దేవిలాల్, రవి, సాయిలు, శంషాద్దీన్, గిరిజన తండా యువతా తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -