- Advertisement -
నవతెలంగాణ – ఆలేరు రూరల్
ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలోని శ్రీ శ్రీ శ్రీ ఆదిజాంభవ మఠంలో జాంభవంతుని విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇంద్రపాలనగర గ్రామ మాదిగ కమ్యూనిటీ సభ్యుల సహకారంతో విగ్రహ ఆవిష్కరణ కోసం రూ.12,000లను చందాగా అందజేశారు. గ్రామం తరపున రుద్రాల గోపాల్ గురుస్వామి, మంటి శంకర్, రుద్రాల అశోక్, మంటి మల్లేష్, గొళ్ళెపల్లి గణేష్, రుద్రాల విక్కీ ఈ విరాళాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు దాతలను ఘనంగా సన్మానించారు. భవిష్యత్తులో కూడా మఠం అభివృద్ధికి తమ సహకారం అందిస్తామని దాతలు తెలిపారు.
- Advertisement -



