నవతెలంగాణ – కట్టంగూర్
మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు నల్లగొండ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో 12 డ్యూయల్ డెస్క్ బెంచ్ లను బుధవారం బహూకరించారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ వైస్ గవర్నర్, ప్రముఖ న్యాయవాది కె.వి.ప్రసాద్ మాట్లాడారు. క్లబ్ సీనియర్ సభ్యుడు బండారు హరినాథ్ సతీమణి యోగమాల జ్ఞాపకార్థం, నల్గొండ లయన్స్ క్లబ్ అధ్యక్షులు నిమ్మల పిచ్చయ్యల సహకారంతో బెంచులను పంపిణీ చేసినట్లు తెలిపారు.
సేవే లక్ష్యంగా తమ క్లబ్ పనిచేస్తుందని పేర్కొన్నారు. తమ క్లబ్బుల ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమాలను స్ఫూర్తిగా తీసుకొని గత ప్రభుత్వం పాఠశాల విద్యార్థులకు స్నాక్స్క్స్ కార్యక్రమాన్ని అమలు చేసిందని చెప్పారు విద్యార్థుల కోసం విరివిగా వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పాఠశాలలో 10వ తరగతి చదివే విద్యార్థులకు త్వరలో క్లబ్బు ఆధ్వర్యంలో ప్రత్యేక తరగతుల సమయంలో స్నాక్స్ ను అందిస్తామని హామీ ఇచ్చారు. నల్లగొండ లయన్స్ క్లబ్ అధ్యక్షుడు నిమ్మల పిచ్చయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రీజియన్ చైర్ పర్సన్ మిరియాల యాదగిరి, బండారు రామలింగం, చిలుకూరి రామకృష్ణ, అశోక్, సాయి కుమార్, కృష్ణయ్య, పాఠశాల ఇన్చార్జి హెచ్ఎం అంటోని, ఉపాధ్యాయులు ఉన్నారు.



