- Advertisement -
నవతెలంగాణ – కట్టంగూర్
మండలంలోని చెరువు అన్నారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాలలకు అదే గ్రామానికి చెందిన కెన్జియం సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ లో పనిచేస్తున్న గద్దపాటి రామకృష్ణ 45 వేల రూపాయల విలువచేసే 8 కంప్యూటర్లను బహుకరించారు. కార్యక్రమంలో హై స్కూల్ ప్రాధనోపాధ్యాయులు రమాదేవి,గద్దపాటి సుధాకర్ ఎడ్ల రాములు, నంద్యాల వెంకటరెడ్డి, పొన్న అంజయ్య, భూపతి నాగరాజు, శ్రవణ్, రవి, ఉపాధ్యాయులు నరహరి, అంగన్వాడీ టీచర్ లలిత, రేణుక, అద్దంకి లింగయ్య ఉన్నారు.
- Advertisement -