- Advertisement -
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
భువనగిరి మండల పరిధిలోని రాయగిరి లో ఆదివారం “సహృదయ అనాధ వృద్ధ ఆశ్రమం” లోనీ 50 మంది వృద్ధులకు హైదరాబాద్ బంజారహిల్స్ వాస్తవ్యులు పారిశ్రామిక వేత్త “పొద్దుటూరి. సుజాత- మురళి “షస్టి పూర్తి” సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించి, రూ.15,000/- విరాళ వంట సామాగ్రి అందించారు. ఈ కార్యక్రమంలో వారి కుటుంబ సభ్యులు కూతురు వాసవి,అల్లుడు వంశీ, చిన్న కూతురు శిల్పా ,మనవళ్లు మనవరాలు పాల్గొన్నారు.
- Advertisement -



